India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంలు ఓటమి పాలయ్యారు. అనంత్‌నాగ్-రాజౌరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సమీప JKNC పార్టీ అభ్యర్థి మియాన్ అహ్మద్ చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు బారముల్లా నియోజకవర్గంలో JKNC ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
AP: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు అయిన విజయవాడ సెగ్మెంట్ ప్రజలు కూటమికి జైకొట్టారు. భారీ ఆధిక్యం దిశగా బీజేపీ, టీడీపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2,43,850 ఓట్ల ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్‌లో బోండా ఉమ 58,225 ఓట్లు, ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్ 47,737 ఓట్లు, వెస్ట్‌లో సుజనా చౌదరి 31,891 ఓట్లు ఆధిక్యంలో రయ్‌మని పరిగెడుతున్నారు.
TG: మహబూబాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కవితపై 3,29,717 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది.
AP: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 22,196 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 20,879 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని ఓడించారు. డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం సాధించారు.
AP: ప్రకాశం జిల్లాలో ఇద్దరు YCP మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)తోపాటు మంత్రులు ఆదిమూలపు సురేశ్ (కొండపి), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు)కు ఓటమి తప్పేలా లేదు. ఎన్నికల కౌంటింగ్‌లో వీరందరూ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఒంగోలులో దామచర్ల 14 వేలకుపైగా, కొండపిలో స్వామి 12 వేలకుపైగా, సంతనూతలపాడులో విజయ్ కుమార్ దాదాపు 30 వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. TDP, జేడీయూలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ప్లాన్ బీ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో శివకుమార్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్సీపీ(ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా చంద్రబాబు, బిహార్ సీఎంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అలయన్స్ నేత శరద్ పవార్ మెజారిటీ పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో ఆయన టచ్‌లో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కూటమికి మద్దతు కోరినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ 298, ఇండియా 231, ఇతరులు 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
NDA అధికారం దూరం చేసేందుకు INDIA కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా JDU మద్దతుకై రంగంలోకి దిగిన శరద్ పవార్ ఉప ప్రధాని పదవిని నితీశ్‌కు ఆఫర్ చేసినట్లు సమాచారం. బీహార్‌లో 15 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నితీశ్ మాత్రం మోదీతోనే కొనసాగుతానని ప్రకటించారు. కానీ గతంలో కాంగ్రెస్, BJP పక్షాలతో నెలల వ్యవధిలోనే పొత్తులు మార్చిన బీహార్ CM మాటపై ఉంటారా? లేదా? అనేది చూడాలి.
లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ BJPకి కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో BRS, BJP ఒకటి కాదని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లాయి. దీనికితోడు మోదీ ప్రచారం BJPకి బూస్ట్ ఇచ్చింది. TGలో గతంలో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 8 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం సెంటిమెంట్, NZBలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీ పనిచేసినట్లు చెబుతున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి జోరు కొనసాగుతోంది. పార్వతీపురంలో TDP అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర.. YCP అభ్యర్థి అలజంగి జోగారావుపై 23,650 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మోహనరావు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కురుపాంలో YCP అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణిపై TDP అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. సాలూరులో YCP అభ్యర్థి రాజన్న దొరపై TDP అభ్యర్థి సంధ్యారాణి గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.