India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ రానున్నారు. ఇప్పటికే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుండటంతో ఆయన కాకినాడ వస్తున్నారు. జిల్లా నాయకులతో కలిసి ఆయన కౌంటింగ్ విశేషాలు తెలుసుకోనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంత్రులు అమర్నాథ్, బొత్స సత్యనారాయణకు షాకిస్తున్నాయి. గాజువాకలో మంత్రి అమర్నాథ్‌పై టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 21,812 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అటు చీపురుపల్లిలో మంత్రి బొత్సపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 2,463 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంపై TDP అభ్యర్థి కూన రవికుమార్ 14,919 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు అందకుండా పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మ.1 గంట వరకు ఎన్డీఏ 293, ఇండియా కూటమి 231, ఇతరులు 18 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. సూరత్‌లో బీజేపీ ఓచోట గెలిచింది. పలు రాష్ట్రాల్లో ఎన్డీఏకు ఓటర్లు షాక్ ఇచ్చేలా కనిపిస్తోండగా, ఇండియా కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు గాను ఏడింట్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఈసారి కూడా అక్కడ కమలం పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 7 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది. మొత్తం 29 సీట్లలో లీడింగ్‌లో ఉంది.
ఈసారి 400 స్థానాల్లో గెలుస్తామన్న BJP అంచనాలు తలక్రిందులయ్యాయి. 2014, 19లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273 సాధించిన కమలం పార్టీ ఇప్పుడు ఈ నంబర్‌ను చేరేందుకు ఇబ్బంది పడుతోంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతోనే మోదీ పీఎం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు NDA-INDIA మధ్య సీట్ల తేడా 100 లోపే ఉంది. దీంతో రామమందిరం, GDP, విశ్వగురు, విజన్ 2047 వంటి అంశాలు ప్రజలను అనుకున్నంతగా ఆకట్టుకోలేదని అర్థమవుతోంది.
పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ దుమ్మురేపుతోంది. అక్కడ 42 ఎంపీ స్థానాలుండగా 31 చోట్ల ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ తక్కువ స్థానాలే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను పటాపంచలు చేసింది. దీంతో పార్టీ శ్రేణులు సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద సంబరాలు మొదలుపెట్టాయి. ఇక బీజేపీ 10 చోట్ల లీడింగ్‌లో ఉండగా కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది.
ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామసహాయం రఘురామ్ రెడ్డి 3,70,921 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చాటుతూ వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్‌కు తన రాజీనామా లేఖను పంపనున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో TDP అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌పై 4,313 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ గత 20 ఏళ్లుగా టీడీపీ గెలవడం లేదు. ఆ పార్టీ నుంచి గత నాలుగు ఎన్నికల్లో వరుసగా పోటీ చేసిన సోమిరెడ్డి ఓడిపోతూ వస్తున్నారు. కూటమి హవా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ ఈసారి సర్వేపల్లిలోనూ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.
ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు బీజేపీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో కాషాయ పార్టీ 74 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. మరోవైపు బీజేడీ 57, కాంగ్రెస్ 13, స్వతంత్రులు 2, సీపీఐ ఒక చోట ముందంజలో ఉన్నాయి. దీంతో కొద్ది తేడాలో అధికారం మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.