News June 2, 2024

అమరవీరులకు సీఎం రేవంత్ నివాళి

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఆయనతో పాటు మంత్రులు, నేతలు స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. కాసేపట్లో సీఎం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

News June 2, 2024

ELECTION COUNTING: అరుణాచల్‌లో బీజేపీ హవా

image

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి అధికారం దిశగా బీజేపీ సాగుతోంది. 60 సీట్లకు గాను పోలింగుకు ముందే 10 స్థానాలు ఏకగ్రీవం చేసుకోగా, ఇవాళ ఓట్ల కౌంటింగులో 50 స్థానాలకుగాను 31 స్థానాల్లో లీడింగులో ఉంది. NPP 8, NCP 3, PPA 2, ఇండిపెండెంట్లు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో 32 స్థానాలకు గాను SKM ఏకంగా 29 స్థానాల్లో లీడింగులో ఉంది.

News June 2, 2024

నేను ఇజ్రాయెలీ బాంబుపై సంతకం చేయలేదు: క్రిస్ ఇవాన్స్

image

ఇజ్రాయెల్ దళాలకు సపోర్టుగా ఓ బాంబుపై తాను సంతకం చేసినట్లు వస్తున్న వార్తలను ‘కెప్టెన్ అమెరికా’ నటుడు క్రిస్ ఇవాన్స్ ఖండించారు. ‘వైరల్ అవుతున్న ఆ ఫొటో 2016 USO టూర్‌లో తీశారు. చాలా మంది యాక్టర్లు, అథ్లెట్లతో కలిసి అక్కడికి వెళ్లాను. నేను సైన్ చేసిన వస్తువు బాంబు, క్షిపణి, ఆయుధం కాదు. అదొక డమ్మీ ఆబ్జెక్ట్’ అని తెలిపారు. కొన్ని నెలలుగా హమాస్‌ మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

News June 2, 2024

AP, TGలో వడదెబ్బతో 11 మంది మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. నిన్న వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. TGలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

News June 2, 2024

అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యం: గవర్నర్

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన ఆయన.. వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని ఆయన పిలుపునిచ్చారు. HYDలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.

News June 2, 2024

పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందాం: CM రేవంత్

image

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ. ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ద ఉత్సవాల వేళ “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని, విశ్వ వేదికపై సగర్వంగా నిలబడుతుందని’ అని సీఎం ట్వీట్ చేశారు.

News June 2, 2024

ఘోర విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం

image

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. 2023 జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. మరో ట్రాక్‌పై పడిన బోగీలను యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 275 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇవాళ పంజాబ్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును <<13360515>>ఢీకొట్టడం<<>> గమనార్హం.

News June 2, 2024

మేలో ₹20.45L Cr యూపీఐ లావాదేవీలు

image

UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మేలో ₹20.45L Cr విలువైన 14.4 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఏప్రిల్‌లో అత్యధికంగా ₹19.64L Cr విలువైన 13.3 బిలియన్ల లావాదేవీలు జరగగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. ఏప్రిల్‌లో ప్రతి రోజూ ₹65,482 కోట్ల విలువైన 443 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరగగా, మేలో ₹65,966 కోట్ల విలువైన 453 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.

News June 2, 2024

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకి కేజ్రీవాల్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిహార్ జైలుకు వెళ్తారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ గడువు ఇవాళ్టితో ముగిసింది. మరోవైపు ఢిల్లీ కోర్టులో ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు జూన్ 5న రానుంది.

News June 2, 2024

‘SSMB 29’లో మహేశ్ సరసన జాన్వీ?

image

మహేశ్ బాబు హీరోగా ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి జాన్వీ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ సరసన జాన్వీనే కరెక్ట్ జోడీ అని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.