News December 2, 2024

బుమ్రాను ఎదుర్కోలేనందుకు సంతోషంగా ఉంది: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

image

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ అనూహ్యంగా పుంజుకొని గెలిచిన విషయం తెలిసిందే. 8 వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించిన బుమ్రాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టీవెన్ ఫిన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా బౌలింగ్ గమనించండి. మనం బ్యాటింగ్‌కి దిగి అతడిని ఎదుర్కొనే అవకాశం లేనందుకు సంతోషంగా ఉన్నామని మీకు అనిపిస్తుంది. బుమ్రా వరల్డ్‌లోనే బెస్ట్. అతడి ఆట చూసేందుకు ఎంతో ఇష్టపడతా’ అని ఫిన్ అన్నారు.

News December 2, 2024

ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

image

TG: వాజేడు SI హరీశ్ <<14767070>>సూసైడ్<<>> కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న రాత్రి ఓ యువతితో ఆయన రిసార్ట్‌కి వెళ్లారు. గన్‌తో హరీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమెనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే ఆ యువతి, హరీశ్ ప్రేమించుకున్నారని, అది నచ్చక ఇంట్లో వాళ్లు వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండటంతోనే అతడు అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

News December 2, 2024

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 తగ్గి రూ.70,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గడంతో రూ.77,350 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.500 తగ్గి రూ.99,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 2, 2024

‘కన్నప్ప’లో మంచు విష్ణు కూతుళ్లు

image

‘కన్నప్ప’ సినిమా ద్వారా మంచు విష్ణు కూతుళ్లు సినీ అరంగేట్రం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అరియానా- వివియానాలు ఢమరుకంతో నాట్యం చేస్తోన్న ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News December 2, 2024

ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలిస్తోంది: CM రేవంత్

image

TG: పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోందని CM రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ ఇందిరమ్మ పాలన అని ‘X’లో పోస్ట్ చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10.52 లక్షల కుటుంబాలు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని, ఇది హర్షణీయం అని పేర్కొన్నారు. అటు, సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించనున్న CM కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.

News December 2, 2024

Rewind24: లక్షన్నర జాబులు పోయాయి

image

ఈ ఏడాది టెక్ ప్రపంచం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. ఇంటెల్, టెస్లా, SAP, Uber, డెల్, మైక్రోసాఫ్ట్, సిస్కో సహా దిగ్గజ కంపెనీల్లో దాదాపు 1.5 లక్షల మందికి పింక్ స్లిప్స్ జారీ అయ్యాయి. ఖర్చుల పొదుపు, టీమ్స్ & కంపెనీ రీస్ట్రక్చరింగ్, AI వంటి కొత్త టెక్నాలజీలు, మార్కెట్ మార్పులకు అనుగుణంగా సన్నద్ధమవడం కోసం యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి.
<<-se>>#Rewind24<<>>

News December 2, 2024

CM రేవంత్‌పై హరీశ్‌రావు విమర్శలు

image

TG: గతంలో మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్‌ ఇప్పుడు తాను సీఎం అయ్యాక ఉన్న రైతుబంధు కూడా ఇవ్వట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో BRS సర్వే చేస్తే రేవంత్ విమర్శించారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే ఎలా ఉందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి పండుగపూట మహిళలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.

News December 2, 2024

కన్నడ నటి సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

image

కన్నడ నటి <<14762879>>శోభిత<<>> మృతిపై బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? భర్తతో విభేదాలా? లేక యాక్టింగ్‌కు దూరంగా ఉండటమా?అనే కోణాల్లో విచారిస్తున్నారు. నిన్న గచ్చిబౌలి శ్రీరామ్‌నగర్ కాలనీలో నటి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

News December 2, 2024

భారీ వర్షాలు, వరదలు.. గర్భిణులకు అండగా వైద్యులు!

image

‘ఫెంగల్’ తుఫాను కారణంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ వైద్య సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టినట్లు అధికారులు తెలిపారు. బలమైన గాలులు, వర్షాల్లోనూ అక్కడి వైద్యులు నవంబర్ 30న రాష్ట్రంలో 1,526 మందికి సురక్షితంగా డెలివరీ చేసినట్లు వెల్లడించారు. గర్భిణులకు ఔషధాలు సైతం అందిస్తున్నామన్నారు.

News December 2, 2024

KCR కంటే దారుణంగా రేవంత్ రెడ్డి పాలన: ఈటల

image

TG: కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలకు పిలుపునిచ్చామని BJP MP ఈటల రాజేందర్ అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బాధితుల వివరాలు సేకరిస్తామని చెప్పారు. KCR కంటే రేవంత్ పాలన దారుణంగా ఉందని ఆరోపించారు. ఏడాది పాలనలో మోసాలు, దగా తప్ప ఏమీలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, PM మోదీ తమకు హామీ ఇచ్చారని చెప్పారు. ఈ నెల 7న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభ ఉంటుందని, జాతీయ నేతలు హాజరవుతారన్నారు.