News June 1, 2024

ఉత్తరాఖండ్‌లో NDA క్లీన్ స్వీప్

image

ఉత్తరాఖండ్‌లో NDA కూటమి 5 పార్లమెంట్ సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది. కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది.

News June 1, 2024

అన్నామలై ఓడిపోతారు: India Today

image

కోయంబత్తూరులో పోటీ చేసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓడిపోవచ్చని India Today-Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆయనపై ఇండియా కూటమి తరఫున నిల్చున్న DMK నేత గణపతి రాజ్‌కుమార్ విజయం సాధిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ అంచనాపై ఇండియా టుడేతో మాట్లాడిన అన్నామలై.. జూన్ 4న సర్‌ప్రైజ్ ఇస్తానన్నారు. కాగా TNలో బీజేపీ బలోపేతానికి అన్నామలై తీవ్రంగా కృషి చేస్తున్నారు.

News June 1, 2024

క్రికెట్‌కు దినేశ్ కార్తీక్ వీడ్కోలు

image

భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, టీమ్‌మేట్స్, అభిమానులకు థాంక్స్ చెప్పారు. భారత జట్టుకు ఆడటం తన అదృష్టమన్నారు. తన జర్నీలో పేరెంట్స్ పిల్లర్లుగా ఉన్నారని చెప్పారు. భార్య దీపిక తన కెరీర్‌ను పణంగా పెట్టి తనకు సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

News June 1, 2024

CNX: NDAకు క్లియర్ మెజారిటీ

image

ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయం కొట్టి మరోసారి అధికారం చేపడుతుందని CNX ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. NDA కూటమి 371-401 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. అటు ఇండియా కూటమి 109-139 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇతరులు 28-38 సీట్లలో గెలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News June 1, 2024

ఇండియా టుడే: అస్సాంలో మళ్లీ NDAదే పెత్తనం!

image

అస్సాంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. ఎన్డీయేకు 9-11 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 2-4 సీట్లు రావచ్చని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో NDA 9, అప్పటి యూపీఏ కూటమికి 3 సీట్లు రాగా AIUDF ఒక స్థానంలో గెలిచింది.

News June 1, 2024

కొడాలి నాని, వంశీ, రోజా ఓడిపోయే అవకాశం: రైజ్ సర్వే

image

AP: వైసీపీలో కీలక నేతలు ఈ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉందని రైజ్ సర్వే సంస్థ అంచనా వేసింది. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, నగరిలో మంత్రి రోజా, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. అలాగే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కూడా ఓటమి తప్పదని రైజ్ సర్వే సంస్థ జోస్యం చెప్పింది.

News June 1, 2024

గుజరాత్‌లో బీజేపీ స్వీప్: India Today

image

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ స్వీప్ చేసే అవకాశం ఉందని India Today Axis My India అంచనా వేసింది. 26 సీట్లున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 25-26, కాంగ్రెస్ 0-1 సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

News June 1, 2024

CVoter: బెంగాల్‌లో TMCకి BJP షాక్!

image

పశ్చిమ బెంగాల్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి అధికార TMCకి BJP షాక్ ఇచ్చే అవకాశం ఉందని ABP CVoter ఎగ్జిట్ పోల్ అభిప్రాయపడింది. ఆ రాష్ట్రంలో బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి 13-17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1-3 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News June 1, 2024

370కి పైగా సీట్లు గెలుస్తాం: నడ్డా

image

దేశంలో ఎన్నికలు సమర్థంగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఇక తాము 370కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నడ్డా పేర్కొన్నారు.

News June 1, 2024

వైసీపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

image

APలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై <<13351074>>వైసీపీ <<>>దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన కోర్టు వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.