News June 1, 2024

YCPకి 14 సీట్లే వస్తాయి: KK సర్వే

image

గత ఎన్నికల్లో YCP గెలుపుపై అత్యంత ఖచ్చిత అంచనాలు వెల్లడించిన KK సర్వే సంచలన ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఏపీలో జగన్ పార్టీ కేవలం 14 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో TDP-133, జనసేన- 21, BJP-7 చోట్ల విజయం సాధించవచ్చని తెలిపింది. మొత్తంగా కూటమి అధికారంలోకి వస్తుందన్న KK సర్వే జనసేన పోటీ చేసిన అన్నిచోట్ల గెలుస్తుందని ప్రకటించడం గమనార్హం.

News June 1, 2024

తెలంగాణలో బీజేపీ జోరు: జన్ కీ బాత్

image

తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీకి అధిక లోక్‌సభ సీట్లు దక్కొచ్చని జన్ కీ బాత్, ఇండియా టీవీ CNX సర్వేలు వెల్లడించాయి. ఇండియా టీవీ CNX: కాంగ్రెస్: 6-8, బీజేపీ: 8-10, బీఆర్ఎస్: 0-1, జన్ కీ బాత్.. కాంగ్రెస్: 4-7, బీజేపీ: 9-12, బీఆర్ఎస్: 0-1 సీట్లు సాధిస్తాయని అంచనా వేశాయి. కాగా తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లున్నాయి.

News June 1, 2024

మాజీ సీఎం ఓడిపోతారు: ఆరా మస్తాన్

image

ఉమ్మడి ఏపీ మాజీ CM కిరణ్ కుమార్‌రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోతారని ఆరా మస్తాన్ వెల్లడించారు. నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురందీశ్వరి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన BJP నేత సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్(BJP) గెలుస్తారని అంచనా వేశారు.

News June 1, 2024

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: ఆరా మస్తాన్

image

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు ఆరా మస్తాన్ తెలిపారు. 17 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ: 8-9, కాంగ్రెస్: 7-8, MIM: 1 సీటు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఖాతా తెరిచే ఛాన్స్ లేదని ఆయన అంచనా వేశారు.

News June 1, 2024

ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం: ఆరామస్తాన్

image

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరామస్తాన్ సర్వే చెబుతోంది. జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది.
– మరిన్ని ఎగ్జిట్ పోల్స్ అందరికంటే ముందుగా వే2న్యూస్‌లో పొందండి.

News June 1, 2024

మంగళగిరి నుంచి లోకేశ్ గెలుస్తారు: ఆరా మస్తాన్

image

AP: టీడీపీ కీలక నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితం వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు.

News June 1, 2024

ABP-C VOTER: వైసీపీకి 0-4 ఎంపీ సీట్లే..

image

AP లోక్‌సభ ఎన్నికల్లో TDP-జనసేన-BJP కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఏబీపీ – సీఓటర్ సర్వే అంచనా వేసింది. ఆ మూడు పార్టీలు 21-25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 0 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 7-9 స్థానాల చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. BRS-0, ఇతరులు 1 చోట విజయం సాధించవచ్చు.

News June 1, 2024

TV9 SURVEY: కేరళలో కాంగ్రెస్‌దే పైచేయి!

image

కేరళకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను టీవీ9 ప్రకటించింది. కాంగ్రెస్‌కు 13 సీట్లు, CPM 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సీపీఐ 1, కేఈసీ 1, BJP 1 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.
> ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వేలో కాంగ్రెస్ కూటమికి 17-18, NDA 2, LDF(సీపీఐ+కేఈసీ) 1 సీటు వస్తుందని తేలింది.

News June 1, 2024

కేరళలో యూడీఎఫ్ హవా: ఇండియా టుడే

image

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అత్యధిక లోక్‌సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. యూడీఎఫ్: 17-18 సీట్లు, ఎన్డీఏ 2-3 సీట్లు, అధికార ఎల్డీఎఫ్: 0-1 సీటు సాధిస్తాయని వెల్లడించింది. యూడీఎఫ్ 41శాతం, ఎన్డీఏ 27శాతం, ఎల్డీఎఫ్ 29శాతం, ఇతరులు 3శాతం ఓట్ షేర్ సాధిస్తాయని పేర్కొంది.

News June 1, 2024

కర్ణాటకలో బీజేపీదే హవా: India Today

image

కర్ణాటకలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని India Today Axis My India తెలిపింది. 28 లోక్‌సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ: 20-22, కాంగ్రెస్: 3-5, జేడీఎస్- 2-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. బీజేపీకి 48 శాతం, కాంగ్రెస్‌కు 41, జేడీఎస్‌కు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.