India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించారు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు కూడా గెలుస్తారని వెల్లడించారు. ఇక తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
తమిళనాడులో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. INDIA కూటమికి 33-37 సీట్లు వస్తాయని అంచనా వేసింది. NDAకు 2-4 సీట్లు, AIADMKకు 0-2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంది.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి 95-110 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. వైసీపీ కేవలం 45-60 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. జనసేన 14-20, బీజేపీ 2-5 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఇక లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 13-15 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైసీపీ 3-5, జనసేన 2, బీజేపీ 2-4 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది.
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి 13, టీడీపీకి 9, బీజేపీకి 2, జనసేన ఒక స్థానంలో గెలుస్తాయని TV9 సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేవని పేర్కొంది. కాగా గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాల్లో గెలవగా.. టీడీపీ కేవలం 3 సీట్లే(గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం) గెలిచింది.
తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని TV9 చెబుతోంది. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.
AP: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాన పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సోషల్ మీడియా వేదికగా పలు సంస్థలు తమ అంచనా ఫలితాలను వెల్లడిస్తుండటంతో తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నివాసంలో పార్టీ నేతల మధ్య చంద్రబాబు ఈ ఫలితాలను నిశితంగా గమనిస్తున్నారు. కాసేపట్లో అన్ని ప్రధాన సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.
TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని BRS అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు లేఖ రాసిన ఆయన.. ‘తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది’ అని పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌పై టీవీల్లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ‘ఈ విషయమై కూటమి సమావేశంలో చర్చించాం. బీజేపీ ప్రీ ఫిక్స్‌డ్ ఎగ్జిట్ పోల్స్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి పార్టీలు చర్చల్లో పాల్గొంటాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా TV చర్చల్లో పాల్గొనమంటూ పవన్ ఖేరా నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సుమారు 2నెలల నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ఎవరు విజేతగా నిలవనున్నారు? ఎవరు ‘ఎగ్జిట్’ కానున్నారు? అనే అంచనాలు రివీల్ కానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయా? లేదా? అని పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం, APలో ఎవరు అధికారం చేపడతారని మీరనుకుంటున్నారు?
** ఎగ్జిట్‌పోల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWSలో..
సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా చివరిదైన 7వ దశ పోలింగ్ ముగిసింది. సా.5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌తో పాటు బెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. దీంతో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు శుభం కార్డు పడింది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.
Sorry, no posts matched your criteria.