News October 27, 2025

నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

image

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీ‌షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.

News October 27, 2025

AI సాయంతో మ్యాథ్స్‌లో రఫ్ఫాడిస్తున్నారు!

image

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్‌ఫామ్‌లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.

News October 27, 2025

ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

image

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్‌కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

News October 27, 2025

త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

image

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.

News October 27, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.

News October 27, 2025

బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే..

image

క్రికెటర్లు మైదానంలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు చెమట రూపంలోనే బయటకు వెళ్తుంది. ఒకవేళ బ్యాటింగ్ చేస్తుండగా యూరిన్ వస్తే ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లో వెళ్లి రావచ్చు. మరీ అర్జెంట్ అయితే అంపైర్ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఫీల్డర్లకు టాయిలెట్ వస్తే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడు కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.

News October 27, 2025

పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని.. రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

News October 27, 2025

అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్‌లో ఉద్యోగం

image

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు. న్యూయార్క్‌లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించారని అతడి తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం అందుకోనున్నట్లు వెల్లడించారు. కాగా అనంతపురం మూలాలు ఉన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEOగా ఉన్న సంగతి తెలిసిందే.

News October 27, 2025

ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

image

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>

News October 27, 2025

పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

image

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.