News March 19, 2024

VIRAL: కింగ్ కోహ్లీ న్యూలుక్

image

మరో మూడ్రోజుల్లో ఐపీఎల్‌ 17వ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్లేయర్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆటతోనే కాకుండా తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. విరాట్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 19, 2024

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

image

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోట్ల సుజాతమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్‌ఛార్జ్‌లు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

News March 19, 2024

పరువు హత్యా? ప్రియుడే చంపాడా?

image

TG: రంగారెడ్డి(D) దండుమైలారంలో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) హత్య సంచలనంగా మారింది. శశి అనే యువకుడిని ప్రేమించినందుకు ఆమెను తల్లి కొట్టి చంపినట్లు భార్గవి సోదరుడు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమ కూతురికి బావతో పెళ్లి చేద్దామని నిర్ణయించడంతో తాము ఇంట్లో లేని సమయంలో శశి వచ్చి చంపేశాడని భార్గవి తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో అమ్మాయి హత్యపై 2 కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని అందులో కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేక షో వేయాలన్నారు. కాగా తెలంగాణలో రజాకార్ల అకృత్యాల ఆధారంగా చిత్రీకరించిన ‘రజాకార్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

News March 19, 2024

సాయంత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల పవన్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఫొటో బయటికొచ్చిన నేపథ్యంలో.. మూవీ టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 19, 2024

రెండు రాష్ట్రాలకు DGPలుగా బ్రదర్స్

image

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం మనం చూశాం. తాజాగా ఇద్దరు సోదరులు రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపికై చరిత్ర సృష్టించారు. గుజరాత్‌ డీజీపీగా వికాస్ సాహే ఏడాదిగా పనిచేస్తుండగా, బెంగాల్‌కు వివేక్ సాహేను పోలీస్ బాస్‌గా నిన్న ప్రభుత్వం నియమించింది. కాగా వారి మరో సోదరుడు విక్రమ్ సాహే IRS అధికారిగా పనిచేస్తుండటం విశేషం.

News March 19, 2024

రూ.50వేలకు మించితే ఆధారాలు చూపాలి: SEC

image

TG: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రూ.50వేల కంటే ఎక్కువ నగదుతో బయటికొస్తే ఆధారాలు, పత్రాలు వెంట తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల్లో అక్రమాలపై సీ విజిల్ యాప్ లేదా 1950 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది. రాజకీయ పార్టీలు ఏ రకమైన ప్రకటనలు ఇచ్చినా వాటికి ఎంసీఎంసీ ఆమోదం తప్పనిసరని పేర్కొంది. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు రూ.21.63 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించింది.

News March 19, 2024

అప్పుడు అబ్బాయికి, ఇప్పుడు బాబాయ్‌కి బీజేపీ పోటు

image

RLJP ఫౌండర్ రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, బాబాయ్ పశుపతికి విభేదాలొచ్చాయి. పార్టీని బాబాయ్ చేజిక్కించుకుని అబ్బాయ్‌ని వెళ్లగొట్టారు. అప్పుడు BJP పశుపతికే సపోర్ట్ చేసి, కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. చిరాగ్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) ఏర్పాటుచేశారు. మారిన పరిస్థితులతో ఇప్పుడు చిరాగ్ పార్టీకే NDA 5 సీట్లను కేటాయించింది. దీంతో పశుపతి కేంద్రమంత్రి పదవికి <<12882991>>రిజైన్<<>> చేశారు.

News March 19, 2024

చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా

image

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.

News March 19, 2024

కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

image

AP: నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.