News May 30, 2024

పల్నాడులో ఖైదీలకు జైళ్లు సరిపోవడం లేదు: ఎస్పీ మలికా గార్గ్

image

AP: ఎన్నికల ఖైదీలకు పల్నాడు జిల్లాలోని జైళ్లు సరిపోవడం లేదని SP మలికా గార్గ్ తెలిపారు. కొంతమందిని రాజమండ్రి జైలుకు పంపుతున్నట్లు చెప్పారు. ‘పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా వ్యాపిస్తోంది. పల్నాడులో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని నా స్నేహితులు అడుగుతున్నారు. చెడు ఘటనలతో పల్నాడు పేరు మార్మోగడం బాధాకరం. కర్రలు, రాడ్లు పట్టుకుని తిరగడం అవసరమా’ అని ఆమె ప్రశ్నించారు.

News May 30, 2024

ఉగాండాను జెర్సీ మార్చుకోమన్న ICC.. ఎందుకంటే?

image

టీ20 వరల్డ్ కప్‌ కోసం ఉగాండా క్రికెట్ బోర్డు ప్రకటించిన జెర్సీని మార్చుకోవాలని ICC సూచించింది. తమ జాతీయ పక్షి అయిన గోధుమ వర్ణపు కొంగను స్ఫూర్తిగా తీసుకొని ఉగాండా జెర్సీని రూపొందించింది. అయితే భుజాలపై కొంగ రెక్కల్లా డిజైన్ ఉండటం వల్ల స్పాన్సర్ల లోగోలు కనిపించవని ICC చెప్పింది. దీంతో ఆ జట్టు జెర్సీని మార్చుకుంది.

News May 30, 2024

ఆ ఊరిలో ఆఖరి వ్యక్తి మృతి

image

తమిళనాడులోని మీనాక్షిపురం గ్రామంలో ఏకైక నివాసి కందసామి నాయకర్(73) మరణించారు. దీంతో ఆ ఊరు దెయ్యాల గ్రామంగా మారింది. 2001లో 1,296 మందితో ఊరు కళకళలాడేది. అస్థిర వర్షాలు, తీవ్రమైన కరవు కారణంగా ఆ గ్రామాన్ని విడిచి అందరూ వలసవెళ్లారు. కందసామి మాత్రం తన భార్యతో 20ఏళ్లు అక్కడే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోగా ఇప్పుడు కందస్వామి కన్నుమూశారు. దీంతో గ్రామం ఖాళీ అయ్యింది.

News May 30, 2024

‘జయజయహే తెలంగాణ’ సంక్షిప్త గీతం ఇదేనా?

image

TG: రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. సంక్షిప్త గీతం ఇదేనంటూ లిరిక్స్‌తో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ‘కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌’ అంటూ సాగే చరణం కనిపించలేదు. మరి పూర్తి గీతంలో అవి ఉంటాయా? లేదా అనేది తెలియాలంటే జూన్ 2 వరకు వేచి చూడాలి.

News May 30, 2024

ప్రచారం: ఎవరెన్ని ర్యాలీలు చేశారంటే?

image

● పీఎం మోదీ: 172 ర్యాలీలు, రోడ్‌షోలు
● అమిత్ షా: 133
● ప్రియాంకా గాంధీ: 108
● రాహుల్ గాంధీ: 107
● రాజ్‌నాథ్ సింగ్: 101
● జేపీ నడ్డా: 87
● అఖిలేశ్ యాదవ్: 73
● మమతా బెనర్జీ: 61

News May 30, 2024

జూన్ 4న కంగనకు కన్యాదానం: విక్రమాదిత్య

image

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గ BJP అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక జూన్ 4న కంగనకు ‘కన్యాదానం’ చేసి హిమాచల్ నుంచి పంపిస్తామని అన్నారు. ఆమె ఒక కాలు ముంబైలో ఉంటే మరో కాలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉందని, అలాంటి వ్యక్తి హిమాచల్‌ వాసుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

News May 30, 2024

జూన్ 2న కీలక నిర్ణయాల ప్రకటన: CM రేవంత్

image

TG: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుతామన్నారు. ఆయా అంశాలపై సచివాలయంలో సహచర మంత్రులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, కళాకారులతో సమీక్ష నిర్వహించినట్లు రేవంత్ ట్వీట్ చేశారు.

News May 30, 2024

బీజేపీకి తొత్తుగా మారిన ఈసీ: పేర్ని నాని

image

AP: కేంద్రంలో, రాష్ట్రంలో BJP ఒత్తిడికి లొంగిపోయి ఎన్నికల సంఘం పని చేస్తోందని YCP నేత పేర్ని నాని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో EC డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ‘TDP తప్పులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా EC పట్టించుకోలేదు. కానీ ఏ పత్రికలో వార్తలు వచ్చినా YCP నేతలపై కేసులు పెడుతున్నారు. ఎన్నికల సంఘంపై కోర్టులో పోరాడుతున్నాం. న్యాయమే గెలిచి తీరుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News May 30, 2024

T20WCలో చిన్న, పెద్ద ఆటగాళ్లు ఎవరంటే?

image

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత కుర్ర ఆటగాడు ఎవరో తెలుసా? నేపాల్‌కు చెందిన గుల్సన్ ఝా. ఇతడి వయసు కేవలం 18 సంవత్సరాలు. ఇక ఈ మెగా టోర్నీలో అత్యంత వయసైన ప్లేయర్ ఫ్రాంక్ న్సుబుగా. ఉగాండాకు చెందిన ఈయన వయసు 43 సంవత్సరాలు. వీరిరువురూ బౌలర్లే కావడం విశేషం.

News May 30, 2024

టాప్-2 అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే?

image

ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చి విజేత ఎవరో తేల్చలేని పరిస్థితి నెలకొంటే.. డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌లోని సెక్షన్ 102 ఈ అవకాశం కల్పించింది. అయితే.. అందుకోసం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుంది. 2019లో రాజస్థాన్‌లో, 2017లో ముంబైలో ఇలాగే ఫలితం తేలింది. <<-se>>#ELECTIONS<<>>