India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఈవెంట్లో బాలకృష్ణ కుర్చీ వద్ద బాటిల్లో మద్యం ఉందంటూ కొందరు నెట్టింట విమర్శలు చేశారు. అయితే, దీనిపై మోక్షజ్ఞ తేజ టీమ్ స్పందించింది. అసలైన ఫుటేజీ ఇదేనంటూ రెండు ఫొటోలను పంచుకుంది. ఆయన కాలి వద్ద సెకండ్ బాటిల్ లేదని, ఇది CG (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ అని క్లారిటీ ఇచ్చింది. యూట్యూబ్‌లో ఉన్న ఈవెంట్ వీడియోలోనూ రెండో బాటిల్ లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పుణేలో పోర్షె కారు ప్రమాద ఘటనలో రోజుకో అంశం వెలుగుచూస్తోంది. ప్రమాదం అనంతరం నిందితుడి బదులు అతడి తల్లి శివాని అగర్వాల్ రక్తం నమూనాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తాజాగా వెల్లడైంది. వాటిని తారుమారు చేసేందుకు అక్కడున్న నలుగురు సహకరించినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడితో పాటు అతడి తండ్రి, తాత సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
AP: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. సత్రంపాడులో నడిరోడ్డుపై జక్కుల రత్న గ్రేస్(22) అనే యువతిని యువకుడు ఏసురత్నం గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. యువతి స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
దేశంలో గత రెండేళ్లలో బ్యాంక్ ఫ్రాడ్స్ 300%, డిజిటల్ ఫ్రాడ్స్ 708% పెరిగినట్లు RBI వెల్లడించింది. FY22లో 9,046 బ్యాంక్ ఫ్రాడ్ కేసులు నమోదు కాగా FY24కి ఆ సంఖ్య 36,075కు చేరింది. అయితే వీటితో నష్టపోయిన మొత్తం రూ.45,358 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గింది. డిజిటల్ ఫ్రాడ్ కేసులు FY22లో 3,596 ఉండగా గత FYలో ఆ సంఖ్య 29,082కు పెరిగింది. కాగా నేరాలను గుర్తించడంలోనూ ఆలస్యం జరుగుతున్నట్లు RBI పేర్కొంది.
AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టతనిచ్చింది. 13ఏ ఫామ్‌పై సీల్, హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని, అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి దానిపై సంతకం చేశారని వెల్లడించింది. ఈమేరకు ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
హీరో రణ్‌వీర్ సింగ్, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రావాల్సిన ‘రాక్షస్’ సినిమా రద్దైంది. కానీ, వీరిద్దరి మూవీ ఫ్యూచర్‌లో ఉంటుందని మైత్రీ మూవీస్ ప్రకటించింది. రాక్షస్‌కి ఇది సరైన సమయం కాదని, భవిష్యత్‌లో ఉంటుందని చెప్పింది. ప్రతిభావంతుడైన ప్రశాంత్‌తో భవిష్యత్తులో సినిమా తీస్తానంటూ రణ్‌వీర్ వెల్లడించారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ నుంచి రణ్‌వీర్ సింగ్ వైదొలిగినట్లు తెలుస్తోంది.
అగ్నికుల్ కాస్మోస్ చేసిన ‘అగ్నిబాణ్’ <<13341954>>ప్రయోగం<<>> విజయవంతం కావడం దేశానికే గర్వకారణమని PM మోదీ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని మొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడిచే అగ్నిబాణ్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష రంగానికి ఒక గొప్ప సందర్భం. ఇది మన యువశక్తి అద్భుత నైపుణ్యానికి నిదర్శనం. అగ్నికుల్ సిబ్బందికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలి’ అని పేర్కొన్నారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై బీజేపీ ఎందుకు ఒక్కకేసూ పెట్టలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘నేను బీజేపీతో పోరాడుతున్నాను. వారు నాపై 24పైగా కేసులు పెట్టించారు. వాటిలో పరువు నష్టం, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. నా లోక్‌సభ సభ్యత్వమూ లాక్కున్నారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈడీ నన్ను 50 గంటల పాటు విచారించింది. పట్నాయక్‌పై ఏ కేసులూ లేవు ఎందుకు?’ అని రాహుల్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు జరుగుతుండటంతో జూన్ 2న ఆవిష్కరణకు వీలుపడటం లేదు. దీంతో ఆ రోజు రాష్ట్ర గీతం మాత్రమే విడుదల చేయనుంది ప్రభుత్వం. చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కూడా సర్కార్ సమాలోచనలు చేస్తోంది.
బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక వివాహం జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. సంప్రదాయ హిందూ పద్ధతిలోనే వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు సాగే వేడుకల శుభలేఖ రిలీజైంది. జులై 12న వివాహం, 13న ఆశీర్వాద కార్యక్రమం, 14న రిసెప్షన్ ఉంటుంది. పెళ్లికి వచ్చేవారు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్‌లో రావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.