News May 30, 2024

గెలిచిన 48 గంటల్లో పీఎంను డిసైడ్ చేస్తాం: జైరామ్ రమేశ్

image

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 సీట్లకుపైగా గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీనే కూటమికి అధ్యక్షత వహిస్తుందన్నారు. గెలుపొందిన 48 గంటల్లోనే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి గెలుపొందాక NDA కూటమిలోని పలు పార్టీలు కూడా తమతో చేతులు కలిపే అవకాశం ఉందన్నారు.

News May 30, 2024

బెంగళూరులో మరో శాఖ: మెడికవర్

image

వచ్చే నెలలో బెంగళూరులో రూ.120 కోట్ల పెట్టుబడితో మరో శాఖను తెరవనున్నట్లు మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో 300 పడకల సామర్థ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నామని చెప్పింది. వచ్చే ఐదేళ్లలో ఆ నగరంలో 4 నుంచి 5 ఆస్పత్రులు తెరుస్తామని పేర్కొంది. తెలంగాణలోని వరంగల్‌లోనూ ఓ శాఖను ప్రారంభిస్తామని వెల్లడించింది. మెడికవర్‌కు భారత్‌లో ప్రస్తుతం 16 నగరాల్లో 23 ఆస్పత్రులున్నాయి.

News May 30, 2024

‘మణిపుర్ హింస కనిపించలేదా?’.. ఇన్‌స్టాలో మరో ట్రెండ్!

image

గాజాలోని రఫా శరణార్థి శిబిరాలపై జరిగిన దాడులపై సోషల్ మీడియాలో ఫైరవుతున్న సెలబ్రిటీలకు మణిపుర్‌లో జరిగిన హింస కనిపించలేదా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏడాది గడుస్తున్నప్పటికీ ఎవరూ స్పందించలేదని మండిపడుతున్నారు. ‘BUT NO EYES ON MANIPUR’ అని ట్రెండ్ చేస్తున్నారు. జాతుల మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి మణిపుర్‌లో హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.

News May 30, 2024

సాయంత్రం సీఎం రేవంత్ కీలక భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించనున్నారు. లోగోలో అమరవీరుల స్తూపం, మూడు రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి కంకులు ఉంటాయని సమాచారం. తెలంగాణ గీతం రూపకల్పన కూడా తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. జూన్ 2న దాన్ని ఆవిష్కరించనున్నారు.

News May 30, 2024

ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు: కేటీఆర్

image

TS: రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ చార్మినార్ వద్ద ధర్నాకు దిగారు. గత పదేళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకుండా ఇలాంటి చర్యలకు దిగడం తగదని అన్నారు.

News May 30, 2024

తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనా?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో భారత జాతీయ చిహ్నం(సింహాలు, అశోక చక్రం), అమరవీరుల స్తూపం, వరి విత్తనాలు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
COURTESY: BIG TV

News May 30, 2024

ట్రంప్ సలహాదారుడిగా మస్క్: WSJ రిపోర్ట్

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మస్క్‌ను వైట్ హౌజ్ సలహాదారుడిగా నియమిస్తారని WSJ కథనం తెలిపింది. సరిహద్దు సమస్యలు, ఎకానమీ వంటి అంశాలపై మస్క్‌తో చర్చించినట్లు పేర్కొంది. దీనిని ఉటంకిస్తూ వీరిద్దరి మధ్య నెల వ్యవధిలో పలుమార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. దీనిపై ఇప్పటివరకు ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా NOV 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

News May 30, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,760 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,200 తగ్గి రూ.1,01,000కు చేరింది.

News May 30, 2024

ఈసెట్ ఫలితాలు విడుదల

image

AP: ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. 93.34 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్ నిర్వహిస్తారు. 36,369 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. WAY2NEWS ఓపెన్ చేయగానే కనిపించే బాక్స్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

News May 30, 2024

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

image

AP: సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ABV సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.