India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి <<14737992>>సోషల్ మీడియాను నిషేధించిన<<>> సంగతి తెలిసిందే. అది చాలా మంచి నిర్ణయమని జనసేన నేత నాగబాబు పేర్కొన్నారు. ‘నేటి పిల్లలు సోషల్ మీడియా చట్రంలో చిక్కుకుని భవిష్యతును చేజార్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకి ఆదర్శం. అన్ని దేశాలూ దీన్ని అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని, జాతిని, ప్రపంచాన్ని చూస్తాం’ అని ట్వీట్ చేశారు.

మతపరమైన ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. సంభల్ అల్లర్లు చల్లారకముందే తాజాగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదంటూ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ భూమిలో ఈద్గాను నిర్మించారంటూ మథురలో, మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో, వారణాసిలోని జ్ఞానవాపిలో ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ వరుస పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ తరహా వివాదాలు అధికమయ్యాయి.

దేశంలోని ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ఈ చట్టంలో కీలక నిబంధనలు ఉన్నాయి. ఆగస్టు 15, 1947 నాటికి మతపరమైన ప్రదేశాల్లో అప్పటికే ఉన్న ప్రార్థనా విధానాలను కొనసాగించాలి. ప్రార్థనా స్థలాల్ని మరొక మతంలోకి మార్చాలనే అభ్యర్థనలను న్యాయపరిధిలో సవాల్ చేయడం నిషేధం (బాబ్రీ మసీదుకు మినహాయింపు). అయితే ప్రస్తుతం ఇలాంటి వివాద పిటిషన్లను కింది కోర్టులు సైతం విచారణకు అనుమతించడం గమనార్హం.

దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో రేపు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. మహ్మద్ అమన్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్ వేలంలో ప్రముఖంగా వినిపించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నారు. అండర్-19 ఆసియా కప్‌లో దాయాదులు ఇప్పటి వరకు 3సార్లు తలపడగా భారత్ 2 సార్లు, పాక్ ఒకసారి గెలుపొందాయి.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంజాబ్, మిజోరం మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. పంజాబ్ గెలిచేందుకు చివరి 4 బంతుల్లో 24 రన్స్ అవసరమవగా క్రీజులో ఉన్న బ్రార్ (4, 6, wd, 6, 6) ఒక వైడ్ సహా 23 పరుగులు రాబట్టారు. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో రమణ్‌దీప్14(5) కొట్టడంతో పంజాబ్ 8 రన్స్ తేడాతో గెలిచింది.

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం, బంగ్లా అల్లర్ల తర్వాత బెంగాల్ CM మమతా బెనర్జీ పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మునుపటిలా కేంద్రం, PM మోదీపై విరుచుకుపడటం లేదు. అంశాలవారీగా మద్దతిస్తున్నారు. మొదట్లో బంగ్లా సంబంధాలపై నాలుక్కర్చుకున్న ఆమె ఆ తర్వాత కేంద్ర వైఖరినే అనుసరిస్తున్నారు. అక్కడి హిందువులపై సానుభూతి చూపుతున్నారు. INDIA కూటమి అదానీ అంశంపై పార్లమెంటును అడ్డుకోవద్దని చెప్పడం విశేషం.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలుండకూడదని పేర్కొన్నారు. ‘పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి. మన వాళ్లు అక్కడికి వెళ్లాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా? పీఎం మోదీ పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం, మన జట్టును అక్కడికి పంపించడానికెందుకు?’ అని ప్రశ్నించారు.

TG: రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు రూ.15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింట్లో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. ఈరోజు ఉదయం సీఎం రేవంత్ సైతం ఇదే <<14740821>>అభిప్రాయం<<>> వ్యక్తం చేశారు.

పనుల్లో బిజీగా ఉండటం లేదా అందుబాటులో టాయిలెట్స్ లేకపోవడంతో మూత్రాన్ని ఆపుకోవడం సహజం. ఎక్కువసార్లు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దీనివల్ల బ్లాడర్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. మూత్రాశయ కండరాలు బలహీనమవుతాయి. ఇన్ఫెక్షన్లు వస్తాయి. యూరినేషన్ సిగ్నల్ రాగానే చేసేయాలి. మీరు పనిలో ఉన్నట్లయితే దానికి తగ్గట్లు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

PSL, SPL వంటి టీ20 లీగులకు ECB షాకిచ్చింది. దేశవాళీ సీజన్ కొనసాగుతున్నప్పుడు లీగ్ క్రికెట్ ఆడకుండా క్రికెటర్లపై ఆంక్షలు విధించింది. IPLకు మాత్రం OK చెప్పింది. వైట్‌బాల్ కాంట్రాక్టు మాత్రమే ఉంటే పర్మిషన్ ఇవ్వొచ్చని, ఫస్ట్‌క్లాస్ కాంట్రాక్టు ఉంటే ఇవ్వొద్దని కౌంటీలకు తెలిపింది. అంటే టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నీలప్పుడు క్రికెటర్లు ఇతర లీగుల్లో ఆడలేరు. దీంతో వారి ఆదాయానికి గండి పడనుంది.
Sorry, no posts matched your criteria.