India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం చరిత్రలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా అమెరికన్ రాబర్ట్ వాడ్లో (272cm) నిలిచారు. తర్వాతి స్థానాల్లో USకు చెందిన జాన్ రోగన్ (267cm) & జాన్ కారోల్ (264cm) & విల్లీ కాంపర్ (262cm)లు ఉన్నారు. అలాగే నెదర్లాండ్స్‌కు చెందిన Trijntje Keever (255 cm) అత్యంత పొడవైన మహిళగా రికార్డులకెక్కారు. ఆమె తర్వాత USకు చెందిన ఎల్లా ఇవింగ్ (254), కెనడాకు చెందిన జెంగ్ జిన్లియన్ (248) ఉన్నారు.

పార్లమెంటు సమావేశాలు వరుసగా వాయిదా పడుతున్నా కేంద్రం ఎందుకు సభను నియంత్రించడం లేదన్నది మిస్టరీగా ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అదానీ వ్యవహారం, మణిపుర్, సంభల్ అల్లర్లు, ఢిల్లీలో శాంతిభద్రతల అంశాలపై సభలో విపక్షాల ఆందోళనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జైరాం రమేశ్ అన్నారు. ఈ అంశాల్లో విమర్శలకు బాధ్యత వహించాలన్న భావనతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని విమర్శించారు.

మహారాష్ట్ర CM ఎవరో తేల్చే కీలక సమావేశం రద్దైంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ‘మహాయుతి’ నేతలు BJP అధిష్ఠానాన్ని కలిసినా స్పష్టత రాలేదు. ఇవాళ ముంబైలో సమావేశం నిర్వహించి CM ఎవరో ఫైనల్ చేస్తామని శిండే ప్రకటించారు. కాగా, ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి రాగానే స్వగ్రామం సతారా జిల్లాలోని దారే బయల్దేరారు. దీంతో శివసేన పార్టీ సమావేశం కూడా వాయిదా పడింది. ఆయన ముంబై తిరిగొచ్చిన తర్వాతే ఆదివారం సమావేశాలు ఉంటాయని సమాచారం.

భారతదేశ మొట్టమొదటి వర్టికల్(నిలువు) లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ, ఫొటోలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది తమిళనాడులోని మండపం, రామేశ్వరం ద్వీపం మధ్యలో ఆకాశనీలం జలాల్లో విస్తరించి ఉంది. ఈ అద్భుతమైన అత్యాధునిక సాంకేతికత అబ్బురపరుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా, 1914లో నిర్మించిన పాత పంబన్ వంతెన తుప్పుబట్టడంతో 2022లో మూసివేశారు.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాను(ఫెంగల్)గా మారనుందని IMD తెలిపింది. రేపు కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాలో 55-75Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కృష్ణపట్నం, నిజాంపట్నం వద్ద మూడో నంబర్, మిగిలిన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదైనప్పటికీ గౌతమ్ అదానీతో సంబంధాలు కొనసాగించేందుకే జపాన్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయని సమాచారం. వాటి ప్రభావం ఎక్కువకాలం ఉండదని మిజుహో ఫైనాన్స్, సుమిటోమో మిత్సూయి ఫైనాన్స్, మిత్సుబుషి UFJ ఫైనాన్స్ భావిస్తున్నాయని తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంపదను సృష్టించగలిగే గ్రూప్ అసెట్సే ఇందుకు కారణం.

AP: కరెంటులో రూ.వేల కోట్ల దొంగతనం బయటపడకుండా మాజీ సీఎం జగన్ తలతిక్క పోలిక చేశారని టీడీపీ మండిపడింది. 2015 సంవత్సరం ధరతో 2021 ధర పోల్చి తిక్క వాదన చేయడం ఏంటని ప్రశ్నించింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఛార్జీలు తగ్గుతాయనే కనీస బుర్ర కూడా లేదా? అని నిలదీసింది. ‘2015లో చంద్రబాబు రూ.4.43కి కొన్నారు. నేను 2021లో రూ.2.49కి కొన్నాను అంటావా’ అంటూ ట్వీట్ చేసింది.

AP: స్కిల్ స్కామ్ కేసులో CM చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని గతంలో CID దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాను ప్రస్తుతం ఢిల్లీలో లేనందున మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

AP: సీఎం చంద్రబాబు రేపు అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో పర్యటించనున్నారు. నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో మధ్యాహ్నం 1.25 నుంచి 1.55 వరకు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు. అదే గ్రామంలో ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఓ గంట పాటు స్థానిక ప్రజలతో సమావేశమై అర్జీలను స్వీకరిస్తారు. మ.3.45 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.

TG: లగచర్ల భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ తీసుకురానుంది. ఇందులో టెక్స్‌టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. స్థానిక యువతకు భారీగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, వేరే కంపెనీలైతే ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.