India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట కలిగింది. ఆయనపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును బ్రిటిష్ కన్జర్వేటివ్ MP బాబ్ బ్లాక్‌మన్ ఖండించారు. మైనారిటీ మతాల ప్రజలను వేధించడం ఆమోదయోగ్యం కాదని UK పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. దేవాలయాలు, హిందువుల ఇళ్లపై కాల్పులతో సమాజం ప్రాణభయంతో బతుకుతోందన్నారు. ఇస్కాన్‌ను బ్యాన్ చేయించేందుకు ప్రయత్నించడం హిందువులపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఈ అంశంపై UK స్పందించాలని కోరారు.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6గంటల్లో 8KMPH వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. చెన్నైకి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రేపు మధ్యాహ్నం కారైకాల్-మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర్లో తీరం దాటే అవకాశముందని చెప్పింది. దీంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని APSDMA వెల్లడించింది.

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. EVMలపై అభ్యంతరాలను కూడా చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర, వంశీచంద్, రఘువీరా, కొప్పులరాజు, సుబ్బరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పళ్లంరాజు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు భేటీ జరగనుంది.

TG: త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.

అదానీపై అమెరికా కోర్టులో అభియోగాల వివాదం తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. CM స్టాలిన్ కొన్నేళ్ల ముందు గౌతమ్ అదానీతో రహస్యంగా సమావేశమయ్యారన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. #AdaniStalinSecretMeet హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. US ఛార్జిషీట్లో ఇండియా కూటమి పార్టీ పాలిస్తున్న TN పేరూ ఉంది. తమ ప్రతినిధులపై లంచం అభియోగాలు నమోదవ్వలేదని అదానీగ్రూప్ ఖండించడం తెలిసిందే.

TG: సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి నిన్న మూడో సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంలో నాలుగో సింగిల్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో అంజలి- చరణ్ మధ్య ఓ మెలోడీ సాంగ్ ఉంటుందని సమాచారం.

అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల స్టూడెంట్లకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవులకు స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి (జనవరి 20) ముందే USA వచ్చేయాలని మెసేజులు పంపుతున్నాయి. వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఛాన్స్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.