India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జూన్ 4న ఎన్నికల ఫలితాలు సత్వరమే ప్రకటించేలా కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 చోట్ల మధ్యాహ్నం 2 గంటల్లోపు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. 61 చోట్ల సా.4 గంటల్లోపు, మిగతా 3 నియోజకవర్గాల్లో సా.6 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. రాత్రి 8-9 మధ్య తుది ఫలితాలను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
AP: రాష్ట్రంలో పక్కగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు, 61 నియోజకవర్గాల్లో 21నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనపు టేబుళ్లు ఏర్పాటు చేశామని
ఆయన వివరించారు.
నీటి కొరత వేధిస్తుండటంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడేలా ఢిల్లీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. నీటిని వృథా చేస్తే రూ.2వేల జరిమానా విధిస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ ప్రకటించారు. కార్లు కడగటం, వాటర్ ట్యాంకులు ఓవర్ ఫ్లోతో నీరు వృథాపోవడం, నిర్మాణ-వాణిజ్యపరమైన అవసరాల కోసం నీటిని వాడటం వంటివాటిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. దీనికోసం 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 31న ప్రజ్వల్ బెంగళూరుకు చేరుకోగానే కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నరేంద్రమోదీ స్టేడియంలో GTvsCSK మ్యాచ్‌లో మైదానంలోకి దూసుకొచ్చి తనను కౌగిలించుకున్న అభిమానికి సాయం చేస్తానని ధోనీ హామీ ఇచ్చారట. ‘‘నేను ధోనీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాక నాకు శ్వాస సమస్యలున్నట్లు ధోనీ గుర్తించారు. సర్జరీ చేయిస్తానని మాట కూడా ఇచ్చారు. ‘నీకేం కాదు. ఏం కానివ్వను’ అని అభయమిచ్చారు’’ అని అభిమాని చెప్పారు. సిబ్బంది తీసుకెళ్లక ముందే ఆ అభిమానితో ధోనీ మాట్లాడటం టీవీల్లోనూ కనిపించింది.
AP: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రంలో రూ.107.96కోట్లు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నగదు తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.70కోట్ల అక్రమ మద్యం పట్టుకోగా.. అందుకు సంబంధించిన కేసుల్లో 61,543 మంది అరెస్టు అయినట్లు వివరించారు. రూ.35.61కోట్ల విలువైన డ్రగ్స్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఒడిశాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే CM నవీన్ ఆరోగ్యంపై కమిటీ వేసి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ‘నవీన్ ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించింది. సొంతంగా ఏమీ చేయలేకపోతున్నారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నవీన్ ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు ఒడిశా ప్రజలకు ఉంది’ అని స్పష్టం చేశారు.
తెలంగాణ గీతం ‘జయ జయహే తెలంగాణ’పై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 13 చరణాలున్న ఈ గీతం 2.30నిమిషాల నిడివితో రూపొందించినట్లు సమాచారం. గతంలో ఇందులో 11 చరణాలుండేవి. ఇప్పుడు అదనంగా మరో 2 జోడించినట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు.
తన మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రమంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కోసం 47 °C ఎండలోనూ రోడ్డుషోలో పాల్గొంటున్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేదని చెబుతూ బెయిల్ కోరడం విడ్డూరమని అన్నారు. కేజ్రీవాల్ చేస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారని ఠాకూర్ చెప్పుకొచ్చారు.
‘కల్కి’ మూవీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బుజ్జి పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఈ వెహికిల్ వెనుకవైపు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండగా 47 kWh బ్యాటరీ ప్యాక్ ఈ భారీ కారును నడుపుతుంది. అలాగే పీక్ టార్క్ ఏకంగా 9800 ఎన్ఎం కావడం విశేషం. హబ్ లెస్ టైర్లతో మహీంద్రా, జయం మోటార్స్ కలిసి దీన్ని రూపొందించాయి. రూ.7 కోట్లతో ఇంజినీరింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేసి బుజ్జి కారును తయారు చేసినట్లు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.