News November 29, 2024

500 కేజీల డ్రగ్స్ పట్టివేత

image

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.

News November 29, 2024

రాజ్యసభ సీటు వార్తలపై నాగబాబు ఏమన్నారంటే?

image

AP: తనకు రాజ్యసభ సీటుపై Dy.cm పవన్ ఢిల్లీ పర్యటనలో <<14729358>>చర్చించారన్న<<>> వార్తలపై నాగబాబు స్పందించారు. ‘అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. సత్యం, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని ట్వీట్ చేశారు.

News November 29, 2024

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. త్వరలో ట్రయల్ రన్!

image

దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ రన్‌ను త్వరలో హరియాణాలోని జింద్-సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు. 8 కోచ్‌లు ఉండే ఈ రైలులో 2,638 మంది ప్రయాణించవచ్చు. గరిష్ఠ వేగం 110km/h ఉంటుంది. ఈ ట్రైన్ డిజైన్‌ను RDSO రూపొందించింది. ప్రస్తుతం దీనిని ‘నమో గ్రీన్ రైలు’గా పిలుస్తున్నారు. కాగా ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లను నడుపుతోంది.

News November 29, 2024

30 ఏళ్ల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు తిరిగొచ్చాడు

image

1993, సెప్టెంబర్ 8న ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కిడ్నాపైన రాజు 30 ఏళ్ల తర్వాత తిరిగొచ్చారు. స్కూల్ నుంచి వస్తుండగా తనను కిడ్నాప్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారని అతను చెప్పారు. రోజూ కొడుతూ పని చేయించారని, పారిపోకుండా రాత్రి పూట తాళ్లతో కట్టేసేవారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తప్పించుకొని ఢిల్లీ చేరుకున్న అతను 5 రోజుల కిందట ఖోడా పోలీసులను సంప్రదించారు. వారు మీడియా సాయంతో కుటుంబం వద్దకు చేర్చారు.

News November 29, 2024

ధనుష్ పెట్టిన కేసుపై నయనతార లాయర్ స్పందన ఇదే

image

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్స్ వాడుకున్నారంటూ ధనుష్ వేసిన <<14722518>>సివిల్ కేసుపై<<>> నయనతార తరఫు లాయర్ స్పందించారు. ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘నయనతార-విఘ్నేశ్ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న Lex Chambers పర్సనల్ లైబ్రరీ నుంచి ఆ క్లిప్ తీసుకున్నాం. అది సినిమాలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ కేసుపై DEC 2న విచారణ జరిగే అవకాశం ఉంది.

News November 29, 2024

RCB కెప్టెన్ కోహ్లీనే: డివిలియర్స్

image

IPL2025లో RCB కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే వ్యవహరిస్తారని మాజీ క్రికెటర్ డివిలియర్స్ వెల్లడించారు. ఇది అధికారికం కాకపోయినా అతనే సారథ్య బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేశారు. భువనేశ్వర్, హెజిల్‌వుడ్, ఎంగిడి లాంటి బౌలర్లను RCB తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. డుప్లెసిస్‌ను జట్టు వదులుకోవడం, కెప్టెన్సీ క్యాండిడేట్స్ లేకపోవడంతో కోహ్లీ తిరిగి బాధ్యతలు చేపట్టడం ఖాయమని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

News November 29, 2024

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP 43 కమిటీలు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు, యువత, SC, OBCలే లక్ష్యంగా ప్రచారానికి 43కమిటీలను నియమించింది. 70 సీట్లున్న ఢిల్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా కమిటీలను ఎంపిక చేశారు. నామినేషన్లు, మీడియా వ్యవహారాలు, డేటా మేనేజ్‌మెంట్ తదితర ఎన్నికల పనులను ఈ కమిటీలు చేయనున్నాయి.

News November 29, 2024

శ్రీవారి దర్శనానికి 13 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వరుడిని 56,952 మంది దర్శించుకున్నారు. 21,714 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు లభించింది.

News November 29, 2024

ధర్మాన మాజీ పీఏ మురళి అరెస్ట్

image

AP: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ, వైద్యారోగ్య శాఖ ఉద్యోగి మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో నిన్నటి నుంచి మురళి, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 20 ఎకరాల భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లు, కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

News November 29, 2024

బోలెడంత టాలెంట్.. ఏం లాభం?

image

Talent is nothing without discipline అనేది పృథ్వీషాకు చక్కగా వర్తిస్తుంది. మరో సచిన్ అని పేరు తెచ్చుకున్న ఇతడు చివరకు IPL వేలంలో అన్ సోల్డ్ గా మిగిలారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో లేట్ నైట్ పార్టీలు, గొడవలు, ఫిట్‌నెస్ సమస్యలతో చిన్న వయసులోనే వివాదాల్లో చిక్కుకున్నారు. టాలెంటెడ్ క్రికెటర్ అయిన పృథ్వీకి 19 ఏళ్లకే దేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.