India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కవిత, చరణ్ ప్రీత్‌లకు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. మిగతా నిందితులు ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మలు జూన్ 3న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఎన్నికల ఫలితాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగాలంటే బీజేపీకి 303కుపైగా సీట్లు రావాలని బ్లూమ్‌బర్గ్ సర్వే వెల్లడించింది. 2019 ఎన్నికల్లో నమోదైన ఆ రికార్డ్ (303) బ్రేక్ అయితే నిఫ్టీ 3% వృద్ధి సాధించొచ్చని తెలిపింది. ఒకవేళ సీట్లు తగ్గితే నిఫ్టీ 2% నష్టపోవడమే కాక రూపాయి, సావరిన్ బాండ్స్ విలువలూ క్షీణించొచ్చని పేర్కొంది. కాగా బీజేపీ 300కుపైగా సీట్లు గెలుస్తుందనేది పలు ట్రేడ్ వర్గాల అంచనా.
TG: ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూన్ 1, 2 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాగల రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని.. రేపు పగటి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించింది.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 31న బెంగళూరుకు రానున్నట్లు ప్రకటించిన ఆయన తాజాగా మూడు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ ప్రజాప్రతినిధుల కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రజ్వల్ శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంటారు.
సినిమా ఈవెంట్లలో ఇంగ్లిష్ మాట్లాడకపోవడానికి గల కారణాలను హీరోయిన్ రష్మిక వెల్లడించారు. ‘చాలామంది నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు. అందుకే నాకు భాష రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తా. ఇంగ్లిష్ మాట్లాడి వారిని అగౌరవపరచాలని కోరుకోను’ అని ఆమె అన్నారు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో రష్మిక తెలుగులో మాట్లాడటంతో అర్థం కాని ఓ అభిమాని ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటూ Xలో ఆమెకు రిక్వెస్ట్ చేయగా ఇలా స్పందించారామె.
దాయాది దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా వినూత్నంగా రివెంజ్ తీర్చుకుంది. ఇటీవల ద.కొరియాలోని కొందరు నిరసనకారులు బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలోకి లేఖలు పంపడం మొదలుపెట్టారు. దీంతో కిమ్ ప్రభుత్వం అందుకు బదులుగా చెత్త కవర్లను భారీ బెలూన్లకు తగిలించి ఆ దేశంలోకి పంపించడం మొదలుపెట్టింది. ఇలా 260కిపైగా బెలూన్లను వదిలింది. దీంతో పలు ప్రాంతాల్లో స్థానికులను బయటకురావొద్దని అధికారులు హెచ్చరించారు.
ఢిల్లీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఇవాళ ముంగేశ్‌పూర్‌లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఇక్కడ 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలోని నజాఫ్‌గఢ్, పిఠంపుర సహా మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇవాళ 50 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
2007 తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఏమాత్రం అంచనాలు లేని భారత జట్టు ధోనీ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లో సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. 2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. 2016, 2022లో సెమీఫైనల్లో పరాజయం పాలవగా.. 2021లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2007 తర్వాత పొట్టి ప్రపంచకప్ భారత్‌కు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
AP: పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 31న భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని HYD చేరుకున్న CBN రేపు రాత్రికి అమరావతికి వెళ్లనున్నారు. పవన్ కూడా రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం మంగళగిరి చేరుకోనున్నారు. అటు పవన్, బాబుల భేటీలో బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
SRH ఫ్యాన్స్ మరచిపోలేని రోజు 2016, మే 29. RCBపై ఫైనల్ గెలిచి తొలిసారిగా ఐపీఎల్ కప్ కొట్టిన ఆ రోజును ఫ్యాన్స్ నెట్టింట గుర్తుచేసుకుంటున్నారు. అయితే సన్‌రైజర్స్ మాత్రం ఒక్క పోస్టూ వేయలేదు. అప్పటి ఫొటోలు, వీడియోల్లో వార్నర్ ఉంటారు కాబట్టే ఆ సందర్భాన్ని SRH గుర్తుచేసుకోవడం లేదని కొందరు అంటున్నారు. ఆ వివాదాన్ని గుర్తుచేయకుండా ఇలా సైలెంట్‌గా ఉంటేనే బెటర్ అని మరికొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.