India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘కల్కి’ సినిమా కోసం స్పెషల్‌గా రూపొందించిన బుజ్జీ (సూపర్ కార్)ని డ్రైవ్ చేయాలని కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ‘ప్రియమైన మస్క్ సర్. మా బుజ్జి (సూపర్ కార్)ని చూసి నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 6 టన్నుల బరువున్న ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియాలో తయారైంది. దీనిని డ్రైవ్ చేయడం మీకు గొప్ప అనుభూతిని ఇస్తుందని నేను భావిస్తున్నా’ అని Xలో మస్క్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
AP: ఎన్నికల ఫలితాలకు మరికొద్ది రోజులే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు బైకులు, కార్లపై నేమ్ ప్లేట్స్ వేయించుకుంటున్నారు. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. అటు విజయవాడలోనూ ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అనే స్టిక్కర్లు వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి.
TG: విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా? అని KTR ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని Xలో నిలదీశారు. ‘BRS హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. కాంగ్రెస్ సర్కారు 6 నెలల్లోనే ఆగం చేసింది. సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారు.. విత్తనాలు అందించే విజన్ కూడా లేదా? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది?’ అని ఫైరయ్యారు.
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌లో అదానీ గ్రూప్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తోందంటూ వస్తున్న వార్తలను పేటీఎం తోసిపుచ్చింది. అదానీ, విజయ్ శేఖర్ శర్మ మధ్య దీనిపై చర్చలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తాము తీసుకునే నిర్ణయాలను ఎప్పటిలానే సెబీ ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. కాగా అదానీ వాటా కొనుగోలు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో పేటీఎం షేర్ల విలువ 5% పెరిగింది.
సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు MAI వెల్లడించింది. PVR-INOX, సినీపొలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్‌లో సినిమాలను ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది. రెండు నెలలుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త రిలీజ్‌లు లేక థియేటర్లు ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే.
రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదుల కోసం రైల్వేశాఖ తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 139. మీరు ప్రయాణిస్తున్న బోగీలో ఏమైనా సమస్యలున్నా, లగేజీని స్టేషన్‌లో, రైలులోగానీ మరిచిపోయినా లేదా చోరీకి గురైనా, ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినా వైద్య సాయానికి ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు. సిబ్బంది అప్రమత్తమై ఫిర్యాదుదారుని సంబంధిత బోగీలోకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న కేసులో సినీ నటి హేమకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు రావాలని ఆదేశించారు. తొలుత ఈ నెల 27న హాజరుకావాలని నోటీసులివ్వగా, వైరల్ ఫీవర్ కారణంగా రాలేనని ఆమె లేఖ రాసిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ జిల్లా గండికోటలోని ఎర్ర కోనేరు ఎండిపోయింది. 900 ఏళ్ల చరిత్ర గల ఈ కొలను అడుగంటిన ఆనవాళ్లు గతంలో లేవని స్థానికులు తెలిపారు. ప్రస్తుత కరవు పరిస్థితులకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రాజుల కాలంలో యుద్ధాల తర్వాత ఖడ్గాలను సైనికులు ఈ కొలనులో కడిగేవారట. ఆ రక్తంతో ఇందులోని నీరు ఎర్రగా మారి ఎర్ర కోనేరు పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
TG: ఉద్యోగం చేస్తూనే చదివేందుకు వీలుగా గత ఏడాది AICTE ‘ఈవెనింగ్ బీటెక్’ కోర్సులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో OU ఇంజినీరింగ్ కాలేజీకి అవకాశం దక్కగా, ఈ ఏడాది మరో 11 కాలేజీలకు అనుమతి లభించే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఏడాది ఉద్యోగ అనుభవం ఉన్న విద్యార్థులు ‘ఈవెనింగ్ బీటెక్’ సెకండ్ ఇయర్‌లో చేరొచ్చు. వీరికి శని, ఆదివారాల్లో క్లాసులు నిర్వహిస్తారు. మూడేళ్లలోనే కోర్సు పూర్తి చేయొచ్చు.
తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందిస్తుండటంపై వివాదం రాజుకుంది. తమ అస్తిత్వంపై ఇంకా ఆంధ్రా గుర్తులు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, కీరవాణి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మూడు దశాబ్దాలుగా కీరవాణి తెలంగాణలోనే ఉంటూ.. ఎన్నో పాటలకు మ్యూజిక్ ఇచ్చారని, సంగీతానికి ప్రాంతీయ హద్దులు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.