News May 29, 2024

ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ ముందే ప్లాన్ చేశాం: రాణా

image

FINALలో విజయం తర్వాత షారుఖ్ ఖాన్‌తో సహా KKR టీమ్ సభ్యులు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సెలబ్రేషన్స్ ముందుగానే ప్లాన్ చేసినట్లు హర్షిత్ రాణా చెప్పుకొచ్చారు. ‘ఒక మ్యాచ్‌కు నన్ను బ్యాన్ చేశాక చాలా బాధ పడ్డాను. అప్పుడు SRK సర్ వచ్చి ధైర్యం చెప్పారు. మనం ఫ్లయింగ్ కిస్‌తో IPLను సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. అన్నట్లుగానే ట్రోఫీతో చేశాం’ అని మీడియాతో చెప్పారు.

News May 29, 2024

త్వరలోనే మీర్జాపూర్-3 స్ట్రీమింగ్?

image

మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్-3 జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తాజాగా గుడ్డూ పండిట్(అలీ ఫజల్) పోస్టర్‌ను ప్రైమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొంది. ఈ సిరీస్‌లో బీనా, అఖండానంద్, మున్నా పాత్రలు ఫేమస్. మీకిష్టమైన క్యారెక్టర్ ఎవరు?

News May 29, 2024

చైల్డ్ ట్రాఫికింగ్ కేసు: పిల్లలను కొనుగోలు చేసిన వారిపైనా కేసులు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చైల్డ్ <<13332424>>ట్రాఫికింగ్<<>> కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లలను అమ్మిన వారితోపాటు కొనుగోలు చేసిన 13 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 50 మందిని విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. 16 మందిని రెస్క్యూ చేసిన విషయం తెలిసిందే. మిగతా వారికోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు.

News May 29, 2024

HYDకు చేరుకున్న చంద్రబాబు

image

ఈ నెల 13న పోలింగ్ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దంపతులు ఇవాళ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. వారికి ఎయిర్‌పోర్టులో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. నేడు ఆయన విశ్రాంతి తీసుకుని రేపు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని సమాచారం. కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కాగా సీఎం జగన్ దంపతులు జూన్ 1న తాడేపల్లికి తిరిగిరానున్నారు.

News May 29, 2024

పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరికలు

image

ఉక్రెయిన్‌కు సహకరిస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పశ్చిమ దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. రష్యాపై దాడులు చేసేందుకు క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇవ్వొద్దని అన్నారు. ఉక్రెయిన్‌లో అధ్యక్ష పదవీ కాలం ఐదేళ్లు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలన్నారు. మరోవైపు వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే శాంతి సదస్సులో ప్రపంచ నేతల మద్దతు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు.

News May 29, 2024

REWIND: చరిత్ర సృష్టించిన SRH

image

IPL: సరిగ్గా ఇదే రోజు 2016లో ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా SRH నిలిచింది. గ్రూప్ స్టేజీలో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లిన వార్నర్ సేన.. ఎలిమినేటర్‌లో KKRపై, క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. FINALలో ఆర్సీబీతో ఉత్కంఠభరిత పోరులో గెలిచి, కప్పు కొట్టింది. ఒక దశలో ఆర్సీబీకి 9 వికెట్లు చేతిలో ఉండి 44 బంతుల్లో 68 రన్స్ చేయాల్సి ఉన్నా.. SRH అద్భుతంగా పుంజుకుని గెలిచింది.

News May 29, 2024

పేటీఎంలో అదానీ వాటా!

image

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేటీఎం మాతృ సంస్థ అయిన One97 Communicationsలో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ చంద్రశేఖర్ శర్మ అహ్మదాబాద్‌లోని అదానీ ఆఫీసుకు వెళ్లినట్లు సమాచారం. ఈ డీల్ ఓకే అయితే అదానీ గ్రూప్.. గూగుల్ పే, ఫోన్ పే , జియో ఫైనాన్షియల్‌కు పోటీ ఇస్తుంది. కాగా, ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం భారీ నష్టాలను చవిచూస్తోంది.

News May 29, 2024

కుడి కిడ్నీ బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు

image

రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో ధన్కడ్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం పేషెంట్ ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. ఓ మహిళా పేషెంట్‌కు కుడి కిడ్నీ తొలగించాల్సి ఉండగా, ఎడమ కిడ్నీని తొలగించారు. ఈ ఘటన కాస్త అధికారుల దృష్టికి వెళ్లడంతో తక్షణమే ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. హాస్పిటల్‌ను సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఐదు‌గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: DGP

image

AP: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News May 29, 2024

మరోసారి రఫాపై దాడులు.. 21 మంది మృతి

image

హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రఫాపై జరిపిన దాడుల్లో 21 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. శరణార్థుల శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని యూఎస్ తప్పుబట్టింది. ఈ దాడుల్లో సాధారణ పౌరులు మరణిస్తున్నారని పేర్కొంది. రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 45 మంది మరణించిన సంగతి తెలిసిందే.