India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుష్ప-2 సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు, ఒకచోట వేంకటేశ్వర్ అన్న పదం తొలగించి భగవంతుడు అన్న పదాన్ని చేర్చినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. వచ్చే నెల 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

AP: సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని శేషాపురంలో ఉన్న శ్రీ శేషాచల లింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హీరో నారా రోహిత్ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. కాగా ఇవాళ నారావారిపల్లెలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి పెద్ద కర్మ జరిగింది. అనంతరం వీరు లింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

2026 ఖేలో ఇండియా గేమ్స్‌కు HYD ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 గేమ్స్ HYDలో నిర్వహించాలని CM రేవంత్ విజ్ఞప్తి చేయగా, బిహార్‌లో నిర్వహించాలనే ఇప్పటికే నిర్ణయించడంతో 2026లో నిర్వహించేందుకు కేంద్రం అంగీకరించింది. గచ్చిబౌలి, సరూర్‌నగర్, LB, KVBR స్టేడియాలు, జింఖానా, ఉస్మానియా క్యాంపస్‌లలో పోటీలు నిర్వహించనున్నారు. 2022లో నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్‌కు HYD గతంలో వేదికగా నిలిచింది.

కేరళలో పెన్షన్ స్కామ్ బయటికొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న 1,458 మంది రూ.1,600 చొప్పున సామాజిక పింఛన్ తీసుకుంటున్నట్లు తేలింది. ప్రతి నెలా రూ.23 లక్షలకు పైగా ప్రజాధనాన్ని వీరు కాజేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వారు తీసుకొన్న పెన్షన్ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

AP: గండికోట ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తమ పూర్వీకులే ఈ కోటను పాలించారని ఆయన చెప్పారు. ‘గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం. ఈ నిధులతో ఇక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా దీనిని తీర్చిదిద్దుతాం’ ఆయన వ్యాఖ్యానించారు.

AP క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్‌కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

నితీశ్ కుమార్ రెడ్డి కోహ్లీకి వీరాభిమాని. 2018లో BCCI అవార్డులకు హాజరైన నితీశ్ విరాట్‌తో సెల్ఫీకి చాలా ట్రై చేశారు. కుదరలేదు. దూరం నుంచే విరాట్, తాను ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా సెల్ఫీ తీసుకుని సంతోషపడ్డారు. కట్ చేస్తే.. 2024లో విరాట్ 81వ సెంచరీ సెలబ్రేషన్లో తానూ భాగమయ్యారు. సెంచరీ పూర్తవగానే తన హీరోని హగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కదా సక్సెస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తనపై కేసుల విషయంలో దర్శకుడు RGV ట్విటర్‌లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్‌పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయి’ అని ట్వీట్ చేశారు.

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా టాలెంటెడ్ ప్లేయర్ అని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. తిరిగి ఆయన IPLలో అడుగుపెడతారని చెప్పారు. ‘నేను కలిసి పని చేసిన టాలెంటెడ్ ప్లేయర్లలో పృథ్వీ ఒకరు. ఆయన నుంచి ఆటను ఎవరూ దూరం చేయలేరు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడం బాధాకరం. యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా పృథ్వీని ఎవరో ఒకరు తీసుకుంటారని భావించా. కచ్చితంగా మళ్లీ ఆయన తిరిగి వస్తారు’ అని రికీ పేర్కొన్నారు.

టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో వచ్చే నెల 6 నుంచి జరిగే డే నైట్ టెస్టులో ఓ వికెట్ తీస్తే 2024లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలుస్తారు. పెర్త్ టెస్టులో ఆయన 8 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ 50 వికెట్ల మార్కుకు 4 వికెట్ల దూరంలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.