News November 28, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. స్టేజ్-2 ఫిజికల్ టెస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఇచ్చిన అవకాశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. డిసెంబర్ చివరి వారంలో PMT, PET టెస్టులు నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News November 28, 2024

ఫుడ్ పాయిజన్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురవడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనలు జరిగిన విద్యాసంస్థలను సందర్శించి, విచారించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అటు ప్రిన్సిపాల్ లేదా వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. స్కూల్స్, వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్స్, అంగన్వాడీ సెంటర్లలో ఈ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఫుడ్ వడ్డిస్తారు.

News November 28, 2024

‘మహా’ ప్రతిష్టంభనకు తెర?

image

మ‌హారాష్ట్ర తదుపరి CM ఎంపికపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫ‌డణవీస్ పేరును బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఖ‌రారు చేసినట్టు India Today తెలిపింది. సీఎం పీఠం కోసం చివ‌రి వ‌ర‌కూ ప‌ట్టుబ‌ట్టిన ఏక్‌నాథ్ శిండేకు డిప్యూటీ సీఎంతోపాటు కీల‌క శాఖ‌లు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. అజిత్ ప‌వార్‌ ఆశించిన శాఖ‌లకు ఓకే చెప్పిన BJP తన వద్ద 15శాఖ‌ల‌ను అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

News November 28, 2024

త్వరలో మరికొందరు అరెస్ట్: RRR

image

AP: తన కస్టోడియల్ కేసును సీఐడీ పారదర్శకంగా విచారణ చేస్తోందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. తనపై దాడి చేసిన అధికారులు కొందరు అరెస్ట్ అయ్యారని, త్వరలోనే మరికొందరు అరెస్ట్ అవుతారని చెప్పారు. ‘సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ నాపట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ నాపై దాడి చేయించారు. ఆయన విదేశాలకు పారిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News November 28, 2024

పార్ల‌మెంటుకు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ

image

నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఏడుగురు పార్ల‌మెంటుకు వెళ్లారు. 1951-52లో అల‌హాబాద్ నుంచి నెహ్రు *1967లో రాయ్‌బ‌రేలీ నుంచి ఇందిరా గాంధీ *1980లో అమేథీ నుంచి సంజ‌య్ గాంధీ *1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ *1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ *2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ *2024లో వ‌య‌నాడ్ నుంచి ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ తరఫున మొదటిసారి పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టారు.

News November 28, 2024

కశ్మీర్ మాదికాదు: నోరుజారి ఒప్పుకున్న పాక్ మంత్రి

image

ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తున్న POK ప్రజలపై పాక్ హోంమంత్రి మోహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారాయి. ‘రాజ్యాంగబద్ధంగా మీరు పాక్ పౌరులు కాదు. ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటే మిమ్మల్ని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దేశం నుంచి విడిపోయి భారత్‌తో కలుస్తామన్న POK ప్రజలకిది అస్త్రంగా మారింది. మరోవైపు POK పాక్‌ది కాదని స్వయంగా ఒప్పుకున్నట్టైంది.

News November 28, 2024

రఫాపై ఉన్న శ్రద్ధ.. బంగ్లాదేశ్‌పై ఏదీ?: పాక్ మాజీ క్రికెటర్

image

రఫాలో పాలస్తీనా ప్రజలపై ఉన్న శ్రద్ధ బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులపై ఎందుకు లేదంటూ పాక్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘రఫా గురించి స్పందించారు. బంగ్లాదేశ్ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘అందరి చూపు రఫా వైపు’ అంటూ గొంతెత్తిన సెలబ్రిటీలు బంగ్లాదేశ్ అల్లర్ల విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News November 28, 2024

6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి తీసుకొచ్చారు: హరీశ్ రావు

image

TG: రేవంత్ సర్కారు ఒక్క ఏడాదిలోనే 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూత పడే దుస్థితి తీసుకొచ్చిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రతీ చిన్న గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని అన్నారు. ‘జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు విద్యార్థులున్న 4,314 స్కూళ్లను శాశ్వతంగా మూసివేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ స్కూళ్లలో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తోంది’ అని Xలో ఆరోపించారు.

News November 28, 2024

డిసెంబర్ 1 నుంచి మరో హామీ అమలు: టీడీపీ

image

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ‘వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పేర్కొంది.

News November 28, 2024

KTRకు సీతక్క సవాల్

image

TG: దిలావర్‌పూర్‌లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి KTR పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. KTRకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని సవాల్ విసిరారు.