India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు ప్రజలు మ్యాన్‌హోల్స్ మూతలు తొలగిస్తుంటారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని తొలగించవద్దని GHMC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. GHMC & శివార్లలో 6,34,919 మ్యాన్‌హోల్స్ ఉండగా అందులో 63,221 లోతైనవి ఉన్నాయి. మూతలు తొలగించడం వల్ల ప్రజలు అందులో పడిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈక్రమంలో లోతైన మ్యాన్‌హోల్స్ గుర్తించేలా వాటి మూతలకు రెడ్ కలర్ వేశారు.
APలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని CS జవహర్‌రెడ్డికి TDP అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘కంబోడియాలో ఏపీకి చెందిన యువకులు చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు వీరిని మోసం చేశాయి. బాధిత యువతను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి’ అని CBN కోరారు.
భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీసీసీఐ, గంభీర్ మధ్య చర్చలు జరిగినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. T20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన చేస్తుందని సమాచారం.
జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆమెతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఈ వేడుకలకు సోనియాను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో దశాబ్ది ఉత్సవాలకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
జింబాబ్వే డాలర్ స్థానంలో జింబాబ్వే గోల్డ్/ZiG పేరుతో ఆ దేశ ప్రభుత్వం తెచ్చిన కొత్త కరెన్సీని ప్రజలు స్వాగతించకపోవడం చర్చనీయాంశమైంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఈ కరెన్సీ తెచ్చింది. కానీ ప్రజల్లో దీనిపై నమ్మకం కుదరక US డాలర్‌కే ఓటేస్తున్నారట. బ్లాక్ మార్కెట్లో డాలరుకు 17 ZiGల చొప్పున కరెన్సీని మార్చుకుంటున్నారు. కాగా ప్రభుత్వం దాదాపు 200 మందికిపైగా కరెన్సీ డీలర్లను అరెస్ట్ చేసింది.
ఉత్తరాది రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు ఇవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో సైతం తాజాగా 30.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వివరించాయి. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి ‘గాడ్‌ఫాదర్’ డైరెక్టర్ మోహన్ రాజాతో సినిమా తీయనున్నారు. మెగాస్టార్ 157వ సినిమాను ఆయన తెరకెక్కిస్తారని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కూర్గ్‌లో సినిమా స్టోరీ గురించి చర్చిస్తున్నారని పేర్కొన్నాయి. చిరు ‘విశ్వంభర’ పూర్తికాగానే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందని వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాను బతుకుతానని అనుకోలేదని శిఖర్ ధవన్ హోస్ట్ చేస్తున్న ఓ షోలో భారత క్రికెటర్ రిషభ్ పంత్ తన అనుభవాలు పంచుకున్నారు. ‘దేవుడు నాకు మరో ఛాన్స్ ఇచ్చాడు. 2 నెలలు పళ్లు కూడా తోముకోలేని స్థితిలో ఉన్నాను. ప్రమాదం తర్వాత నరకం చూశా. నెలల తరబడి భయంకరమైన బాధను అనుభవించా. బయటికి రావాలన్నా భయం వేసేది. ఈ ప్రమాదం నా జీవితాన్ని చాలా మార్చింది. అనుభవాలు నేర్పింది’అని తెలిపారు.
TG: బ్రిటిష్ కాలం నాటి చట్టాలలో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత VH డిమాండ్ చేశారు. జుడీషియల్ రిమాండ్‌ను 14 కంటే ఎక్కువ రోజులు పెంచాలని కోరారు. పేద ఇంట్లో ఆడపిల్లలను రేప్ చేసి చంపితే ఇప్పటివరకు ఆ కుటుంబాలకు న్యాయం జరగలేదని.. నర్మదా బచావో ఆందోళనలో రైతులకు న్యాయం జరగడానికి 23 ఏళ్లు పట్టిందన్నారు. దోషులకు త్వరగా శిక్ష పడితేనే తప్పు చేయాలనే భయం అందరిలో ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.