News October 27, 2025

జూబ్లీహిల్స్ ప్రచారానికి CM.. షెడ్యూల్ ఇదే

image

TG: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న వెంగళరావు నగర్, సోమాజీగూడ, నవంబర్ 1న బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడ, 8, 9న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి ప్రచారం చేయనున్నారు.

News October 27, 2025

APPLY NOW: SBIలో 103 పోస్టులు

image

SBI 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్‌పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://sbi.bank.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 27, 2025

$1B కాంట్రాక్ట్ రద్దు.. సైబర్ దాడుల వల్ల కాదు: TCS

image

Marks & Spencer కంపెనీ తమతో 1B డాలర్ల హెల్ప్‌డెస్క్ కాంట్రాక్టును ముగించడంపై TCS స్పందించింది. సైబర్ దాడులకు, కాంట్రాక్ట్ ముగించడానికి సంబంధం లేదని చెప్పింది. సైబర్ దాడి వైఫల్యాల వల్లే M&S కంపెనీ కాంట్రాక్టును పునరుద్ధరించలేదన్న టెలిగ్రాఫ్ కథనాన్ని తోసిపుచ్చింది. ‘సైబర్ దాడులు ఏప్రిల్‌లో జరిగాయి. కానీ మరో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు జనవరిలోనే M&S టెండర్లు ప్రారంభించింది’ అని తెలిపింది.

News October 27, 2025

70 రకాల సొంత విత్తనాలతో సేంద్రియ సేద్యం

image

30 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడెకన్నకు చెందిన రైతు చిన్న చంద్రమ్మ. విత్తనాలు, ఎరువుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తెలంగాణ డీడీఎస్ KVKతో కలిసి 70కి పైగా విభిన్న విత్తనాలను నిల్వ చేసి వాటినే సాగు చేస్తూ, ఇతర రైతులకు అందిస్తున్నారు. సాగు, రైతులపై పాటలు కూర్చి రేడియోలో పాడి స్ఫూర్తి నింపుతున్నారు.☛ రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

బాలీవుడ్ యువ నటుడి ఆత్మహత్య

image

బాలీవుడ్ యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో తన ఇంట్లో ఈనెల 23న ఆయన ఉరి వేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత మరో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 24న చనిపోయారు. ‘జంతారా సీజన్2’తో సచిన్ ఫేమస్ అయ్యారు. ఆయన నటిస్తున్న ‘అసుర్వన్’ మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

image

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

News October 27, 2025

తుఫాను.. ఈ విషయం గుర్తుంచుకోండి!

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాను సమయంలో ఒక్కసారిగా వర్షాలు ఆగి, భీకర గాలులు తగ్గి, ఆకాశం ప్రశాంతంగా ఉంటే సైక్లోన్ ఎఫెక్ట్ ముగిసిందని భావించవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అది తుఫాను మధ్యలో విరామం లాంటిదని, కాసేపటికి విరుచుకుపడుతుందని చెబుతున్నారు. గతంలో విశాఖలో హుద్-హుద్ తుఫాను సమయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

సిస్టర్స్ డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

image

సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదాబాద్(Haryana)కు చెందిన రాహుల్(19)కు తన ముగ్గురు అక్కల మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను సైబర్ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫొటోలను SMలో పెడతామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురై రాహుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌‌పై కేసు నమోదైంది. రాహుల్ ఫ్రెండ్ నీరజ్‌‌పైనా అనుమానాలున్నాయి.

News October 27, 2025

NMDCలో 197 పోస్టులు

image

ఛత్తీస్‌గఢ్ దంతేవాడలోని NMDC 197 అప్రెంటిస్‌ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ITI, డిప్లొమా, డిగ్రీ లేదా ఫార్మసీ సైన్స్/ BBA ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ట్రేడ్ అప్రెంటిస్‌లు ముందుగా apprenticeshipindia.gov.in/లో, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు nats.education.gov.in/లో ఎన్‌రోల్ చేసుకోవాలి. NOV 12 – 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తుంది. వెబ్‌సైట్: https://www.nmdc.co.in/

News October 27, 2025

పండుగ రోజుల్లో పకోడీలు తింటున్నారా?

image

పండుగంటే దైవారాధనలో నిమగ్నమవ్వడం. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పకోడీలు తినడం వల్ల మనస్సు చంచలానికి గురై, నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. పకోడీల్లో వేసే ఉల్లిపాయలకు తామసిక గుణాన్ని(ఉత్తేజాన్ని) పెంచే శక్తి ఉంటుంది. అందుకే పండుగ రోజున వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు. పర్వదినాల్లో భగవద్భక్తి, ప్రశాంతత ప్రధానం కాబట్టి ఇలాంటి ఆహారాన్ని దూరం ఉంచి, ఆ రోజును ఆధ్యాత్మిక నిష్ఠతో గడపాలని అంటున్నారు.