News May 28, 2024

‘నేను ఫుల్ బిజీ’ అనే బిల్డప్ రాయుళ్లకు నష్టమే ఎక్కువ

image

డెడ్ లైన్లు, టార్గెట్ల కారణంగా పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి సహజం. అయితే కొందరు తమ మీద కావాలనే వర్క్ ఓవర్ లోడ్ వేసుకుని, తాము తీవ్ర ఒత్తిడి, బిజీగా ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతారు. దీన్ని స్ట్రెస్ బ్రాగింగ్/బిజీ బ్రాగింగ్ అంటారు. ‘కొందరు ఒత్తిడి గురించి మాట్లాడి బాగా పనిచేస్తున్నామనుకుంటారు. దీనివల్ల లాభం కంటే హాని ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని ఓ సైకాలజిస్టు వెల్లడించారు.

News May 28, 2024

డిజిటల్ చెల్లింపుల రంగంలోకి అదానీ?

image

వివిధ రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందట. యూపీఐతో పాటు ONDC ద్వారా ఈ-కామర్స్ సేవలను సైతం అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ‘అదానీ వన్’ యాప్‌లోనే ఈ సేవలను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం ఈ యాప్‌లో ఫ్లైట్, హోటల్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

News May 28, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసుపై CBI విచారణ అడగరా?: సీఎం

image

TG: ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన బదిలీల్లో మాయమైన వస్తువులకు బాధ్యులను తేల్చే క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడిందని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయొచ్చని చెప్పారు. అన్నింటికీ CBI విచారణ జరపాలనే KTR, హరీశ్ రావు.. ట్యాపింగ్ కేసుపై మాత్రం అడగరా? అని CM ప్రశ్నించారు.

News May 28, 2024

IPL-2024: 1.61 లక్షల మొక్కలు నాటనున్న BCCI

image

IPL 2024 ప్లేఆఫ్స్‌లో నమోదైన ఒక్కో డాట్ బాల్‌కు BCCI 500 చెట్లు నాటనుంది. క్వాలిఫయర్ 1&2, ఎలిమినేటర్, ఫైనల్‌తో కలిపి మొత్తం 323 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఈక్రమంలో టాటా భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 చెట్లను నాటనుంది. ప్లేఆఫ్స్‌లో నటరాజన్ అత్యధిక డాట్ బాల్స్ వేశారు. 3 ఇన్నింగ్స్‌లో 26 డాట్స్‌ వేసి 13వేల మొక్కలు నాటేందుకు సహాయపడ్డారు. గతేడాది 294 డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి.

News May 28, 2024

టీడీపీ రీపోలింగ్ ఎందుకు అడగలేదు?: సజ్జల

image

AP: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ కోరలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. తమ అభ్యర్థులకు అన్యాయం జరిగింది కాబట్టే రీపోలింగ్ అడుగుతున్నామన్నారు. CBN వైరస్‌తో ఈసీ ఇన్‌ఫెక్ట్ అయిందని, అందుకే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

News May 28, 2024

ప్లీజ్.. ఇప్పటికైనా విమర్శలు ఆపండి: పీటర్సన్

image

సోషల్ మీడియాలో కొందరు భారత ప్లేయర్లకు వ్యతిరేకంగా చేసే విమర్శలు ఇప్పటికైనా తగ్గించాలని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశారు. ఫైనల్లో తాను చేసిన వ్యాఖ్యలనుద్దేశించి సోషల్ మీడియాలో <<13329161>>రాయుడి<<>>పై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఆయన తప్పు బట్టారు. దయచేసి ఇకనైనా ఇలాంటివి ఆపాలని ఆయన కోరారు.

News May 28, 2024

డిఫరెంట్ లుక్‌లో అల్లరి నరేశ్

image

అల్లరి నరేశ్ కొత్త మూవీ ‘బచ్చలమల్లి’ నుంచి పోస్టర్‌ను ట్వీట్ చేశారు. పోస్టర్‌లో నరేశ్ కొత్త లుక్ డిఫరెంట్‌గా ఉంది. మాస్ లుక్‌లో రిక్షాపై బీడి తాగుతున్నట్లుగా ఉన్న పోజ్ ఆకట్టుకుంటోంది. కాగా ఆయన హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై నిరాశపర్చింది.

News May 28, 2024

కేటీఆర్‌ను విమర్శించినవారి ఫోన్లను ట్యాప్ చేశాం: భుజంగరావు

image

TG: పేపర్ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించినవారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామని తన వాంగ్మూలంలో అప్పటి ఇంటెలిజెన్స్ ASP భుజంగరావు వెల్లడించారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టామని భుజంగరావు పేర్కొన్నారు.

News May 28, 2024

విపక్ష, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం: భుజంగరావు

image

TG: BRSకు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామని సస్పెండైన ఇంటెలిజెన్స్ ASP భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ‘విపక్ష, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. వారి వాహనాలను ట్రాక్ చేశాం. GHMC, మూడు ఉపఎన్నికల సమయంలో, మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను ట్యాప్ చేశాం. ఇదంతా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ సాయంతోనే చేశాం’ అని ఆయన వెల్లడించారు.

News May 28, 2024

BRS నేతల సూచనలతో సెటిల్‌మెంట్లు చేశాం: భుజంగరావు

image

TG: బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అప్పటి ఇంటెలిజెన్స్ ASP భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ‘BRS నేతల సూచనలతో సెటిల్‌మెంట్లు చేశాం. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బు తరలించాం. టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యాశ్రీధర్ రావు రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించాం’ అని వివరించారు.