News May 28, 2024

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: చిరంజీవి

image

దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనకు నివాళి అర్పించారు. ‘కొందరి కీర్తి అజరామరం. భావితరాలకు ఆదర్శం. తారక రామారావు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచిత గౌరవం అని భావిస్తున్నా. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్రప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News May 28, 2024

త్వరలో ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్?

image

హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ LIC సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త ప్రభుత్వం కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసే అవకాశం ఉందని LIC ఛైర్మన్ సిద్ధార్థ మోహంతి పేర్కొన్నారు. ప్రస్తుతం జీవిత బీమాకే పరిమితమైన ఎల్ఐసీకి ఈ కాంపోజిట్ లైసెన్స్‌తో మరో రకం ఇన్సూరెన్స్‌ను అందించే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఆరోగ్య బీమా సేవలను ఎంచుకుంది.

News May 28, 2024

మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

image

AP: కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు. బుల్లబ్బాయి రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

News May 28, 2024

భారత్ కోచ్ పదవికి 3వేల దరఖాస్తులు

image

భారత జట్టు కోచ్ పదవి కోసం BCCIకి 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ధోనీ వంటి సెలబ్రిటీల పేర్లతోనూ అప్లికేషన్లు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే వీటిలో చాలా వరకు నకిలివే ఉన్నట్లు తెలుస్తోంది. 2022లోనూ 5వేల అప్లికేషన్లు రాగా, వాటిలో ఎక్కువగా ఫేక్ అని గుర్తించారు. కాగా నిన్నటితో కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

News May 28, 2024

పులిచింతల జలాశయం ఖాళీ.. రైతులకు ఇక్కట్లు

image

AP: గత ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు, కృష్ణా నదికి వరదలు లేకపోవడంతో పల్నాడు జిల్లా అచ్చంపేటలోని పులిచింతల జలాశయం ఖాళీ అయ్యింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 45.77 TMCలు కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ జలాలు కూడా లేవు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి కృష్ణా డెల్టాలో రైతులు ఖరీఫ్‌లో 10.35 లక్షల ఎకరాల్లో వరి సాగు, 5.71 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. నీళ్లు అడుగంటడంతో ఈసారి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.

News May 28, 2024

10 లక్షల ప్రమాద క్లెయిమ్‌లు పెండింగ్!

image

రోడ్డు ప్రమాద బాధితులకు బీమా సంస్థలు వేగంగా సెటిల్మెంట్ చేయడం లేదు. ప్రస్తుతం రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు RTI సమాచారంతో వెల్లడైంది. బాధితులకు సత్వర న్యాయం అందకపోవడంపై కేసీ జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. త్వరలోనే ఇది విచారణకు రానుంది.

News May 28, 2024

సిజేరియన్లపై కొరడా.. ఆస్పత్రుల వివరణ ఏంటంటే?

image

AP: సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న 104 ఆస్పత్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ స్థాయిలో ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హై రిస్క్ కేసులు వస్తున్నాయని, అలాగే ముహూర్తాల పేరుతో ఒత్తిడి చేయడం వల్ల ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి.

News May 28, 2024

భూమిపై పడిన మిస్టీరియస్ వస్తువు

image

నార్త్ కరోలినా (US)లోని అడవుల్లో హైకింగ్ చేస్తున్న ఓ వ్యక్తికి మిస్టీరియస్ వస్తువు కనిపించింది. కార్బన్ ఫైబర్‌తో కూడిన ఈ ఆబ్జెక్ట్ 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, ఒక అంగుళం మందంతో కాలిపోయి ఉంది. దీనిపై బోల్ట్‌లు కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక నుంచి ఇది భూమిపై పడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందంటున్నారు.

News May 28, 2024

మద్యం షాపుల్లో నగదు అనుమతి: అధికారులు

image

AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లో నగదును కూడా అనుమతిస్తున్నామని బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు స్పష్టతనిచ్చారు. మద్యానికి డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అనుమతిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో బెవరేజస్ కార్పోరేషన్ అధికారులు స్పందించారు. ఫిబ్రవరిలోనే డిజిటల్ పేమెంట్స్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. తాజాగా ఆదేశాలేమి ఇవ్వలేదని పేర్కొన్నారు.

News May 28, 2024

అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా

image

శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు. ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు ప్రయోగం వాయిదా పడింది.