News May 28, 2024

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల ఆధునికీకరణకు సీఎం ఆదేశం

image

TG: రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్ హాళ్లు, కెఫెటేరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, మేడ్చల్, HYD, సంగారెడ్డి జిల్లాల్లోని ఆఫీసులకు ప్రాధాన్యమివ్వాలని, సిబ్బంది కొరత ఉండకూడదని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 104 ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు.

News May 28, 2024

ఆ హామీలు అవినీతి పరిధిలోకి రావు: సుప్రీంకోర్టు

image

రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలు అవినీతి పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలో ఎమ్మెల్యే అహ్మద్ ఖాన్ ఎన్నికను సవాల్ చేస్తూ ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల్లో ప్రత్యక్ష, పరోక్ష సాయం పేరుతో చేసే వాగ్దానాలు అవినీతికి పాల్పడటం కిందకే వస్తాయని పిటిషనర్ వాదించారు. అయితే ఇది సరి కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పిటిషన్‌ను కొట్టివేసింది.

News May 28, 2024

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘పుష్ప’ విలన్

image

తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్(APHD)తో బాధపడుతున్నట్లు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం ఫహాద్ తెలుగులో ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆవేశం’ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

News May 28, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

image

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 81,831 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.

News May 28, 2024

స్వదేశాలకు SRH ప్లేయర్లు.. క్లాసెన్ పోస్ట్

image

ఐపీఎల్ ముగియడంతో SRH ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా సౌతాఫ్రికా హిట్టర్ క్లాసెన్ విమానంలో ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Bye Bye India అని క్యాప్షన్ పెట్టారు. అటు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నారు.

News May 28, 2024

ఆస్పత్రుల భద్రతపై అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

image

ఆస్పత్రుల్లో <<13317535>>అగ్నిప్రమాదాలు<<>> జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ‘హాస్పిటల్స్‌లో అగ్నిమాపక ఏర్పాట్లపై తనిఖీలు చేపట్టాలి. ఫైర్ అలారమ్స్, మంటలను ఆర్పే పరికరాలను ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా లోటుపాట్లను సరిదిద్దాలి. ప్రమాదం జరిగినప్పుడు రోగులను సురక్షితంగా తరలించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’ అని పేర్కొంది.

News May 28, 2024

కావ్య మారన్‌ను అలా చూస్తే బాధేసింది: అమితాబ్

image

ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి తర్వాత SRH ఓనర్ కావ్య మారన్‌ ఎమోషనల్ అవడం చూసి తనకు బాధేసిందని అమితాబ్ బచ్చన్ తెలిపారు. కెమెరాలకు అటువైపుగా ముఖం తిప్పుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూశానని ఆయన తన బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్‌లో అదే టచింగ్ మూమెంట్ అని పేర్కొన్నారు. ఓటమిని పట్టించుకోకుండా రేపు మరో అవకాశం వస్తుందని గుర్తుంచుకోవాలని కావ్యకు సూచించారు.

News May 28, 2024

సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అంటే ఏమిటి?

image

రక్త హీనతలో ఓ రకం హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్. ఇది జన్యుపరమైన వ్యాధి. పేరెంట్స్‌కు ఆ వ్యాధి ఉంటే పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. దీన్ని తొలుత లాస్‌ఏంజెలిస్‌లో, మన దేశంలో మొదటిసారి పంజాబ్‌లో గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారి రక్తంలో హిమోగ్లోబిన్‌ 5% కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో నిత్యం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నిర్మూలించగలం.

News May 28, 2024

ఇద్దరు ఏపీ చిన్నారుల్లో అరుదైన వ్యాధి

image

పంజాబ్‌లో మాత్రమే కనిపించే సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే అరుదైన వ్యాధిని పల్నాడుకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు GGH సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. ‘వెల్దుర్తి మండలం నుంచి ఇద్దరు పిల్లలు ఎనీమియాతో ఆస్పత్రికి వచ్చారు. వారికి పరీక్ష చేయగా ఈ వ్యాధి బయటపడింది. దీనికి ఎముక మజ్జ మార్పిడే పరిష్కారం. ఈ వ్యాధి గుర్తించిన చోట పిల్లలకు రక్త పరీక్షలు చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

News May 28, 2024

అయోధ్యకు TTD సలహాలు కోరాం: రామ జన్మభూమి ట్రస్టు

image

AP: అయోధ్య రామాలయంలో భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లపై TTD సలహాలు కోరినట్లు రామ జన్మభూమి ట్రస్టు సభ్యుడు దినేశ్ రామచంద్ర తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. TTDలో అమలు చేస్తున్న నియమాల గురించి ఆలయ EO ధర్మారెడ్డి లిఖితపూర్వకంగా వివరించారన్నారు. వాటిని అయోధ్యలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. రాముని దర్శనానికి రోజుకు 1.50 లక్షల మంది వస్తున్నట్లు పేర్కొన్నారు.