India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నైరుతి రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని IMD డైరెక్టర్ మృత్యుంజయ్ తెలిపారు. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికలకు సంబంధించి జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఫలితాలను ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రకటించాలని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని సీఈవోలతో వర్చువల్ సమీక్షలో తెలిపారు. కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిస్‌ప్లే బోర్డుల ద్వారా కచ్చితమైన ఫలితాలు వెల్లడించాలని చెప్పారు.
AP: జూన్ 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1 నుంచి 10వ తరగతుల విద్యార్థుల కోసం EM, TM పాఠ్యపుస్తకాలను ఆన్‌లైన్‌లో PDF రూపంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మిగతా మీడియంలకు సంబంధించిన పుస్తకాలను త్వరలోనే అందుబాటులో ఉంచుతామన్నారు. పుస్తకాల PDFలను cse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్, అతని భార్య లూసీ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో పాక్‌తో నేడు జరిగే మూడో టీ20కి అతను దూరం కానున్నట్లు తెలిపింది. అతనికి, అతని ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది. జోస్ దంపతులకు ఇప్పటికే జార్జియా రోస్, మార్గోట్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు.
AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు, 147 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. మండలాల వివరాల కోసం ఇక్కడ <
దేశంలోని ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు జూన్ తొలి వారంలో వెలువడే అవకాశం ఉంది. ఈనెల 26న జరిగిన ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 2న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల చేయనుండగా, 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 4 లేదా 5న ర్యాంకులను ప్రకటించనున్నట్లు సమాచారం.
TG: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాష్ట్ర గీతాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.
నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. ‘అన్నగారు’ అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీరంగంలో, రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ‘యుగ పురుషుడు’ NTR జయంతి నేడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. కాగా ఇప్పటికే రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని ఇంటర్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులు ఈనెల 31లోగా రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్‌లో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
వెబ్‌సైట్: https://www.tswreis.ac.in/
Sorry, no posts matched your criteria.