News May 28, 2024

మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు.. అందరిలో ఉత్కంఠ

image

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఆ రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థుల్లో బెదురు మొదలైంది. ఎవరెవరిని విజయం వరిస్తుంది, ఎవరికి అపజయం పరిచయం అవుతుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాలి.

News May 28, 2024

రాజమౌళి-మహేశ్ సినిమాలో ‘ఆదిపురుష్’ హనుమంతుడు?

image

రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటించనున్నట్లు సమాచారం. ఆయన రాజమౌళితో దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. దేవదత్త నాగే ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమంతుని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News May 28, 2024

TGSRTC ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌, వరంగల్‌లోని TGSRTC ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10లోపు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని సూచించింది. మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, మెకానిక్‌ డీజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. వివరాలకు 9100664452, 040-23450033, 9849425319, 8008136611 నంబర్లలో సంప్రదించవచ్చు.

News May 28, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 28, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:48 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:46 గంటలకు
ఇష: రాత్రి 08.06 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 28, 2024

మే 28: చరిత్రలో ఈరోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జననం
1896: ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి జననం
1923: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జననం
1958: సంగీత దర్శకుడు సాలూరి కోటేశ్వరరావు (కోటి) జననం
1999: సినీ దర్శకుడు, నిర్మాత బి.విఠలాచార్య మరణం

News May 28, 2024

ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగం విఫలం

image

శత్రుదేశాలపై కన్నేసేందుకు నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలనుకున్న నార్త్ కొరియాకు చుక్కెదురైంది. తాజాగా నిర్వహించిన ప్రయోగంలో ఉపగ్రహాన్ని నింగికి తీసుకెళ్తున్న రాకెట్ గాల్లోనే పేలిపోయింది. గత ఏడాది నవంబరులో కూడా ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా చేసిన రెండు ప్రయోగాలు విఫలమయ్యాయి. చైనా అండగా నిలుస్తుండటంతో ప్యాంగ్యాంగ్ గత ఏడాదిన్నరగా భారీగా క్షిపణి ప్రయోగాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

News May 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 28, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 28, మంగళవారం
బ.పంచమి: మధ్యాహ్నం 03:24 గంటలకు
ఉత్తరాషాడ: ఉదయం 9.33 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:12 నుంచి ఉదయం 09:14 వరకు
తిరిగి రాత్రి 10:58 నుంచి రాత్రి 11:42 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు

News May 28, 2024

HEADLINES TODAY

image

* తీరం దాటిన రెమాల్ తుఫాన్
* AP: జగన్‌పై రాయి దాడి.. నిందితుడి బెయిల్ తీర్పు రిజర్వు
* AP: పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
* AP: CSను తొలగించాలి: TDP
* తెలంగాణ కవులపై ఆంధ్రా సంగీత దర్శకుల పెత్తనమా?: RSP
* TG: అధికార చిహ్నంపై CM రేవంత్ కసరత్తు
* మరో 5 రోజుల్లో రుతుపవనాలు: IMD
* ఫ్రెంచ్ ఓపెన్‌ నుంచి నాదల్ నిష్క్రమణ