India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అఫ్గానిస్థాన్‌కు చెందిన తాలిబన్ గ్రూపును నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి రష్యా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అధికారిక వార్తాసంస్థ ఆర్ఐఏ నొవొస్తీ సోమవారం ఈ విషయం తెలిపింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. తాలిబన్లతో సత్సంబంధాలకు రష్యా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలున్నా సరే అఫ్గాన్‌తో వాణిజ్యం నిర్వహిస్తోంది.
రాజస్థాన్‌లోని ఫలోడిలో ఈరోజు దేశంలోనే 49.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఢిల్లీ ముంగేష్‌పూర్‌లో 48.8 డిగ్రీలు, నివారి(MP)లో 48.7 డిగ్రీలు, భటిండా(PB)లో 48.4, ఝాన్సీ(UP)లో 48.1, నాగ్‌పూర్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. మరో 2 రోజులు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరించింది.
TG: జూన్ 1, 2, 3 తేదీల్లో BRS ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించాలని KCR నిర్ణయించారు. జూన్ 1న గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. 2న ఆస్పత్రులు, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ తర్వాత పార్టీ నేతలతో KCR సమావేశమవుతారు. 3న BRS ఆఫీసుల్లో ముగింపు వేడుకలు నిర్వహించి.. అనంతరం జాతీయ, పార్టీ జెండాలు ఎగురవేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతున్న వేడి కారణంగానే ప్రీ మెచ్యూర్ బర్త్స్(37 వారాలు నిండకుండానే పుట్టే శిశువులు) చోటుచేసుకుంటున్నాయని అమెరికాలోని నెవాడా వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 1993 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికావ్యాప్తంగా 5.3 కోట్ల జననాలను వారు పరిశీలించారు. గడచిన పాతికేళ్లలో పెరుగుతున్న వేడికి తగ్గట్టుగానే ప్రీమెచ్యూర్ జననాలు కూడా 2శాతం మేర పెరిగాయని స్పష్టం చేశారు.
AP: CS జవహర్‌రెడ్డిని తొలగించి, ఆయనపై CBI విచారణకు ఆదేశించాలని TDP డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కుTDP నేత కనకమేడల రవీందర్ లేఖ రాశారు. ‘అధికారులు, తన అధికారాలను CS దుర్వినియోగం చేశారు. 800 ఎకరాల అసైన్డ్ భూములను కుమారుడు, బినామీల పేరిట కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా?’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
తన తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ రిలీజ్ కానున్న నేపథ్యంలో నటి జాన్వీ కపూర్ చెన్నైలోని ముప్పత్తమ్మన్ గుడిని దర్శించుకున్నారు. మాజీ నటి మహేశ్వరి ఆమెతో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆ గుడి తన తల్లికి అత్యంత ఇష్టమైన ప్రదేశమని వెల్లడించారు. తెలుగులో జాన్వీ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో కనిపించనున్నారు.
TG: ఇవాళ జరిగిన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.
AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఎండ <
AP: జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
TG: జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని CS శాంతికుమారి వెల్లడించారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళుల అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7-9 వరకు కళారూపాల కార్నివాల్, పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన, డ్వాక్రా మహిళలు-ప్రముఖ సంస్థలతో ఫుడ్ స్టాళ్ల ఏర్పాటు, చివరగా బాణసంచా, లేజర్ షో నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.