India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. ఈడీతో పాటు సీబీఐ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు.
రెండు నెలలపాటు సాగిన IPL ముగిసింది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు టోర్నీలో భాగమయ్యారు. మరి ప్లేయర్లకు IPL లాభదాయకమేనా అంటే.. లీగ్‌లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. ఆటగాళ్ల ప్రతిభ బయటపడటం, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఒత్తిడిని జయించడం, దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం వంటి లాభాలు కలుగుతాయి. అలాగే అలసిపోవడం, దేశ జట్టుపై సీరియస్‌నెస్ కొరవడటం, గాయాల పాలవడం వంటి నష్టాలు ఉన్నాయి.
T20 WCలో భాగంగా నమీబియాతో జరిగే వార్మప్ మ్యాచులో ఆస్ట్రేలియా 8 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది. మిగతా 3 స్థానాలను కోచింగ్ సిబ్బందితో భర్తీ చేయనుంది. స్టాఫ్‌లోని జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్‌డొనాల్డ్, ఆండ్రూ బొరొవిక్ ఫీల్డింగ్ చేస్తారని సమాచారం. కాగా IPLతో కొందరు ఆసీస్ ఆటగాళ్లు ఇంకా USA వెళ్లలేదు. అటు కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, గ్రీన్, మార్ష్ తదితరులు రెస్ట్‌లో ఉన్నారు.
SRH యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టారు. 15 మ్యాచులు ఆడి 303 పరుగులతో పాటు 3 వికెట్లు కూడా తీశారు. కొన్ని మ్యాచుల్లో విఫలమైనా మిగతా వాటిలో సత్తా చాటడంతో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు ఆయనకు దక్కింది. దీంతో టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. వచ్చే సీజన్‌లోనూ ఇలాగే ఆడి SRHకు కప్పు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నారు.
ఆప్ MP స్వాతి మాలీవాల్ తీస్ హజారీ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నారు. <<13259628>>దాడి<<>> కేసులో స్వాతి తనకు తానే గాయపరుచుకుందేమోనని బిభవ్ తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు. ఆమెపై దాడి చేయాలని లేదా వేరే ఏ ఇతర ఉద్దేశం బిభవ్‌కు లేదని ఆయన కోర్టులో తెలిపారు. అనేక మంది ఉండే సీఎం నివాసంలో దాడి జరిగే అవకాశం ఉండదని, బిభవ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో లాయర్ వాదనలతో కోర్టులోనే ఉన్న స్వాతి కన్నీళ్లు పెట్టుకున్నారు.
TG: వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు నిండిపోవడంతో శివుడి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆలయంలో ప్రత్యేకంగా చెల్లించుకునే కోడెమొక్కుల కోసం కూడా భక్తులు భారీగా వేచి ఉన్నారు. అటు మరో పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఐపీఎల్ ఫైనల్ కావడంతో నిన్న దేశంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, కేఫ్‌లకు కాసుల పంట పండింది. సాధారణ వీకెండ్‌తో పోలిస్తే నిన్న 30-50% ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యాయట. ఎన్నికలు, సమ్మర్ వెకేషన్ల సీజన్ కావడంతో పబ్స్, బార్స్, రెస్టారెంట్లకు గతకొన్ని రోజులుగా కస్టమర్ల తాకిడి తగ్గింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్‌తో రెస్టారెంట్లకు బూస్ట్ వచ్చినట్లు అయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
AP: సీఎం జగన్ అండతోనే సీఎస్ జవహర్ రెడ్డి భూకుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు. సీఎస్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘తాడేపల్లి పెద్దలతో కలిసి సీఎస్ భూకబ్జాలకు పాల్పడ్డారు. భోగాపురం మండలంలో రూ.2 వేల కోట్ల భూకుంభకోణం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. అత్యధికంగా 75,679 పాయింట్లను చేరిన సెన్సెక్స్, ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 75,630 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 23,043 తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించడం.. FII కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి, దోపిడీకి యత్నించారు. ఎదురుతిరిగిన వాక్టర్‌పై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి, చికిత్స తీసుకుంటూ మరణించారు. 2007లో ఆర్మీ వైవ్స్ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్.. జనరల్ హాస్పిటల్ అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200 ఎపిసోడ్స్‌లో నటించారు.
Sorry, no posts matched your criteria.