India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత 12 నెలల్లో 30 కోట్ల మందికి పైగా చిన్నారులు ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ప్రతి 8 మంది చిన్నారుల్లో ఒకరు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఎక్కువగా సెక్స్ చాటింగ్, పెద్దలు, ఇతరుల నుంచి శృంగార చర్యలకు అభ్యర్థనలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య అని, ప్రపంచమంతా ఏకమై వేధింపుల నివారణకు కృషి చేయాలని కోరారు.
IPL చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్క్ తొలి 9 మ్యాచుల్లో 7 వికెట్లే తీశారు. ఇతడి కోసం రూ.24.75 కోట్లు ఖర్చు చేయడమా అని సెటైర్లు వేశారు. కానీ కీలక మ్యాచుల్లో తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పారు స్టార్క్. క్వాలిఫయర్-1లో SRHను 3 వికెట్లతో దెబ్బకొట్టిన అతడు.. FINALలో అభిషేక్, త్రిపాఠిలను ఔట్ చేశారు. క్వాలిఫయర్-1, FINALలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య న్యూయార్క్ చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత జట్టుతో ఆయన కలిశారు. లండన్‌లో ఉన్న కారణంగా ఫస్ట్ బ్యాచ్‌తో కలిసి పాండ్య అమెరికా వెళ్లలేకపోయారు. దీంతో అక్కడి నుంచే నేరుగా ఆయన న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కారు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగియడంతో రెండో బ్యాచ్ కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధమైంది.
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో జూన్ 7న రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో మనీషా కోయిరాలా, ఊర్మిళ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పలు రికార్డులు బద్దలుకొట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ కూడా జులై 12న విడుదల కానుంది.
ఎంతో ఉత్కంఠగా సాగుతుందనుకున్న IPL-2024 ఫైనల్ క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచులో KKR జయకేతనం ఎగరేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలోనే (తొలి 6 ఓవర్లు)125 రన్స్ చేసిన SRH.. నిన్నటి మ్యాచులో 113కే ఆలౌటైంది. ప్రత్యర్థులపై ఉప్పెనలా విరుచుకుపడే అభిషేక్, హెడ్, క్లాసెన్.. KKR బౌలింగ్‌కు దాసోహమయ్యారు. అటు బౌలింగ్‌లోనూ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు.
APలో రహదారులు నెత్తురోడాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వారు TNలోని వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా కోడూరుపాడు పెట్రోల్ బంక్ వద్ద కారు లారీని ఢీకొట్టడంతో తమిళనాడుకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కాకినాడలో రాత్రి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.
TG: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రఫాపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 35 మంది మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అధికారులు యాసిన్ రబియా, ఖలీద్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌గా సునీల్ నరైన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు మూడు సీజన్లలో అతను ఈ ఘనత సాధించారు. 2012లో 24 వికెట్లు, 2018లో 357 రన్స్, 17 వికెట్లు, 2024లో 488 రన్స్, 17 వికెట్లతో రాణించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచారు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేసినందుకు HYDలోని ముక్త ఏ2 సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ ఫైన్ వేసింది. 2023లో నిష్ఫర్ అనే వ్యక్తి సినిమాకు వెళ్లారు. AC, ఫ్యాన్ పనిచేయట్లేదని థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సరైన స్పందన రాకపోవడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాదనలు విన్న కమిషన్ ఆ వ్యక్తికి టికెట్ డబ్బులు, ₹3వేలు, కేసు ఖర్చులకు ₹1,000 ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.