News October 27, 2025

పండుగ రోజుల్లో పకోడీలు తింటున్నారా?

image

పండుగంటే దైవారాధనలో నిమగ్నమవ్వడం. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో పకోడీలు తినడం వల్ల మనస్సు చంచలానికి గురై, నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంటుంది. పకోడీల్లో వేసే ఉల్లిపాయలకు తామసిక గుణాన్ని(ఉత్తేజాన్ని) పెంచే శక్తి ఉంటుంది. అందుకే పండుగ రోజున వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు. పర్వదినాల్లో భగవద్భక్తి, ప్రశాంతత ప్రధానం కాబట్టి ఇలాంటి ఆహారాన్ని దూరం ఉంచి, ఆ రోజును ఆధ్యాత్మిక నిష్ఠతో గడపాలని అంటున్నారు.

News October 27, 2025

BWF-2025 తదుపరి టోర్నీలకు పీవీ సింధు దూరం

image

ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత PV సింధు ‘BWF TOUR-2025’ తదుపరి ఈవెంట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ లీగ్‌కు ముందు పాదానికి తగిలిన గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గాయం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాలిక ఫిట్‌నెస్, ఆట మెరుగుపడటానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. 2026 JANలో బ్యాడ్మింటన్ కోర్టులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

News October 27, 2025

తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

image

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.

News October 27, 2025

ఇంటి చిట్కాలు

image

* గాజు సామగ్రిపై ఉప్పు చల్లి, తర్వాత శుభ్రపరిస్తే అవి తళతళా మెరుస్తాయి.
* వెండి సామగ్రి భద్రపరిచేటపుడు వాటితో సుద్దముక్కని కూడా పెట్టాలి. ఇవి తేమను పీల్చుకుని వెండి నల్లబడకుండా చేస్తాయి.
* సన్నని మూతి ఉన్న ఫ్లవర్ వాజు క్లీన్ చేయాలంటే బియ్యం, గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా గిలకొట్టి శుభ్రం చేయాలి.
* బల్లుల బెడద ఎక్కువగా ఉంటే, నెమలీకలు గోడలకి తగిలిస్తే సమస్య తగ్గుతుంది.

News October 27, 2025

నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

image

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీ‌షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.

News October 27, 2025

AI సాయంతో మ్యాథ్స్‌లో రఫ్ఫాడిస్తున్నారు!

image

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్‌ఫామ్‌లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.

News October 27, 2025

ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

image

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్‌కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.

News October 27, 2025

త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

image

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.

News October 27, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.

News October 27, 2025

బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే..

image

క్రికెటర్లు మైదానంలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు చెమట రూపంలోనే బయటకు వెళ్తుంది. ఒకవేళ బ్యాటింగ్ చేస్తుండగా యూరిన్ వస్తే ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లో వెళ్లి రావచ్చు. మరీ అర్జెంట్ అయితే అంపైర్ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఫీల్డర్లకు టాయిలెట్ వస్తే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడు కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.