News May 24, 2024

టాస్ ఓడిన SRH.. ఫైనల్ జట్లు ఇవే

image

SRHతో జరుగుతున్న క్వాలిఫయర్-2లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నారు.
SRH: హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, కమిన్స్(C), భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్.
RR: కాడ్మోర్, జైస్వాల్, సంజూ శాంసన్(C), రియాన్, జురెల్, పావెల్, అశ్విన్, చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్.

News May 24, 2024

దేవెగౌడ సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లాడు: సీఎం

image

లైంగిక వేధింపుల కేసు నిందితుడు, తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ దేశానికి తిరిగి రావాలంటూ మాజీ PM దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక CM సిద్ధరామయ్య సెటైర్లు వేశారు. ఆయన సహకారంతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని, కేవలం ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే ప్రకటన చేశారని విమర్శించారు. కాగా గతనెల 26న అర్ధరాత్రి ప్రజ్వల్ బెంగళూరు నుంచి జర్మనీకి వెళ్లి, అక్కడి నుంచి లండన్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News May 24, 2024

ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

image

TG: వచ్చే నెల 8 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అదే నెల 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి 18న తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. మొత్తం రెండు దశల్లో కౌన్సెలింగ్ జరగనుంది. జులై 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్, అదే నెల 17 నుంచి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఇక జులై 21న రెండో విడత సీట్లు కేటాయించి, 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

News May 24, 2024

సారాను చూసి గర్వపడుతున్నా: సచిన్

image

తన కుమార్తె సారా క్లినికల్ & పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో UCL మెడిసిన్ డిపార్ట్‌మెంట్ నుంచి మాస్టర్ డిగ్రీని పొందినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. ‘సారాను చూస్తే తల్లిదండ్రులుగా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ స్థాయి వరకు రావడం అంత సులభం కాదు. నువ్వు కన్న కలలన్నీ సాధిస్తావని నమ్ముతున్నా. ఇది ఎంతో మధురమైన రోజు’ అని సచిన్ ట్వీట్ చేశారు.

News May 24, 2024

విత్తనాల కొనుగోలులో రైతన్నలు జాగ్రత్త: TG పోలీసులు

image

TG: విత్తనాల కొనుగోలు విషయంలో రైతన్నలు అప్రమత్తతతో, అవగాహనతో వ్యవహరించాలని రాష్ట్ర పోలీసులు తాజాగా సూచించారు. విత్తనాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకే కొనాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ విత్తనాల విషయంలో ఏదైనా సందేహం వస్తే వెంటనే తమను సంప్రదించాలని ట్విటర్‌లో స్పష్టం చేశారు.

News May 24, 2024

పీకే బీజేపీ ఏజెంట్: తేజస్వీ యాదవ్

image

ప్రశాంత్ కిశోర్ బీజేపీ కోసం పనిచేస్తూ, ఆ పార్టీ సిద్ధాంతాలను అనుకరిస్తున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి బీజేపీ పీకేను రంగంలోకి దింపిందన్నారు. తమ వ్యూహంలో భాగంగానే కేంద్రం అతడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. పీకే బీజేపీ ఏజెంట్ అన్న తేజస్వీ.. అతను ఏ పార్టీలో ఉంటే అది నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు.

News May 24, 2024

CMకి ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు: షర్మిల

image

AP: లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. 13ఏళ్ల ఓ విద్యార్థిని అత్యాచారానికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ సీఎం జగన్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. ‘మీ పాలన మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడ అని దేశమంతా చెప్పుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.

News May 24, 2024

మీరు చూపించిన ప్రేమకు థాంక్స్: కోహ్లీ

image

ఈ సీజన్‌లోనూ RCBని ప్రేమించిన ఫ్యాన్స్‌కు కోహ్లీ థాంక్స్ చెప్పారు. ‘ఎప్పటిలాగే మమ్మల్ని ప్రేమించినందుకు, ప్రశంసించినందుకు RCB అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు’ అనే క్యాప్ష‌న్‌తో ఇన్‌స్టాలో టీమ్ ఫొటో షేర్ చేశారు. IPL2024 ఫైనల్ రేసు నుంచి RCB నిష్క్రమణ తర్వాత ఫ్యాన్స్‌ కోసం కోహ్లీ చేసిన తొలి పోస్ట్ ఇదే. కాగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ చేరిన RCB.. ఎలిమినేటర్‌లో RR చేతిలో ఓడింది.

News May 24, 2024

దేశీయ మార్కెట్లోనే అతిపెద్ద ఐపీఓ!

image

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా $3 బిలియన్లు రాబట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే LIC రికార్డ్ ($2.7 బిలియన్లు) బ్రేక్ చేసి భారత మార్కెట్లో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఇక మొత్తంగా కంపెనీ విలువ $20 బిలియన్లు నమోదు చేయొచ్చని అంచనా వేస్తున్నాయి.

News May 24, 2024

ఆ జిల్లాల్లో ఈ నెల 27న ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు: ఈసీ

image

TG: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు ఈసీ సూచించింది.