News November 25, 2024

కల్కి-2 ప్రీప్రొడక్షన్ పనులు షురూ: మేకర్స్

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సూపర్ హిట్ కావడంతో పార్ట్-2పై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గురించి నిర్మాతలు స్వప్న, ప్రియాంక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూట్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కల్కి 2898ADతో పాటే సీక్వెల్‌కు సంబంధించి 35 శాతం షూటింగ్ పూర్తయినట్లు IFFI వేడుకల్లో చెప్పారు.

News November 25, 2024

గుడ్ న్యూస్.. ఓటు నమోదుకు గడువు పెంపు

image

TG: ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓటు నమోదుకు గడువు పొడిగించారు. డిసెంబర్ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిసెంబర్ 25లోగా అభ్యంతరాలు స్వీకరించి, అదే నెల 30న తుది జాబితాను విడుదల చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్లు <>ఇక్కడ క్లిక్<<>> చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

News November 25, 2024

$99,800 వద్ద బిట్‌కాయిన్‌లో SHAKEOUT

image

క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్‌కాయిన్ దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం $98000 వద్ద కొనసాగుతోంది. అంటే భారత కరెన్సీలో రూ.82.60 లక్షలు అన్నమాట. మొన్న $99,800 వద్దకు చేరుకున్న BTC లక్ష డాలర్లను తాకడం లాంఛనమే అనుకున్నారు. రెసిస్టెన్సీ ఎదురవ్వడం, ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో $95,600కు దిగొచ్చింది. ఇన్వెస్టర్లు అక్యూములేట్ చేసుకోవడంతో మళ్లీ పుంజుకుంది. ఏదేమైనా లక్షల డాలర్లను తాకడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

News November 25, 2024

STOCK MARKETS: 400 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఆరంభం

image

అనుకున్నదే జరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,300 (+400), సెన్సెక్స్ 80,286 (+1175) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, రియాల్టి, O&G రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీలో JSW స్టీల్, ఇన్ఫీ మినహా 48 కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫిన్, M&M, LT, BEL, BPCL టాప్ గెయినర్స్. నిఫ్టీ చివరి 2 సెషన్లలోనే 800 పాయింట్ల మేర పెరగడం విశేషం.

News November 25, 2024

FLASH: భారీ విజయం దిశగా భారత్

image

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 79 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఇక భారత్ గెలుపు లాంఛనమే. నాథన్ 0, ఖవాజా 4, కమిన్స్ 2, లబుషేన్ 3, స్టీవెన్ స్మిత్ 17 పరుగులకు ఔటయ్యారు. ట్రావిస్ హెడ్(45) క్రీజులో ఉన్నారు. బుమ్రా 2, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఇంకా 455 పరుగులు చేయాల్సి ఉంది.

News November 25, 2024

భారత డ్రెస్సింగ్ రూంలో హిట్‌మ్యాన్

image

కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా డ్రెసింగ్ రూంలో కనిపించారు. కోచ్ గంభీర్‌తో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్నారు. నిన్న పెర్త్ స్టేడియానికి చేరుకున్న రోహిత్.. ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారు. బిడ్డ జన్మించడంతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యారు.

News November 25, 2024

మార్చి నాటికి 9 MLC స్థానాలు ఖాళీ

image

TG: రాష్ట్రంలో 9 MLC స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి 3, ఇండిపెండెంట్లు 2, MIM నుంచి 1 స్థానం మార్చి నాటికి ఖాళీ కానుండటంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలో ఇప్పటి వరకూ BRSదే మెజార్టీ ఉండగా.. ఖాళీ స్థానాలన్నింటినీ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

News November 25, 2024

తక్కువ ధరకే అమ్ముడైన టాలెంటెడ్ ప్లేయర్స్

image

IPL వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు టాలెంటెడ్ ప్లేయర్లను తక్కువ ధరకే దక్కించుకున్నాయి. ఆల్‌రౌండర్ మార్‌క్రమ్‌ను లక్నో(రూ.2కోట్లు), కీలక ఇన్నింగ్స్ ఆడే త్రిపాఠిని CSK(రూ.3.4కోట్లు) కొనుగోలు చేసింది. భారీ సిక్స్‌లు కొట్టే మ్యాక్స్‌వెల్‌ను PBKS రూ.4.2కోట్లకు, Mమార్ష్‌ను లక్నో రూ.3.4కోట్లకే సొంతం చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ డికాక్‌ను KKR రూ.3.60కోట్లు, రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకే ఖాతాలో వేసుకున్నాయి.

News November 25, 2024

నోటీసులపై నటుడు అలీ స్పందన

image

అక్రమ నిర్మాణాలు ఆపాలని తనకు జారీ చేసిన నోటీసులపై నటుడు అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ (M) ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నిన్న నోటీసులిచ్చారు. కట్టడాలను నిలిపివేయాలని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే.

News November 25, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.