News October 27, 2025

అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్‌లో ఉద్యోగం

image

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు. న్యూయార్క్‌లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించారని అతడి తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం అందుకోనున్నట్లు వెల్లడించారు. కాగా అనంతపురం మూలాలు ఉన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEOగా ఉన్న సంగతి తెలిసిందే.

News October 27, 2025

ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

image

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>

News October 27, 2025

పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

image

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

News October 27, 2025

భారత్‌తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

image

వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్‌గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్‌కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.

News October 27, 2025

పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

image

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News October 27, 2025

కోర్టు విచారణలు AIతో చకచకా

image

కోర్టుల్లో లక్షల కేసులు ఏళ్లపాటు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాల్లో సిబ్బంది, వనరుల కొరత ఒకటి. దీనికి AI చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని 4వేల కోర్టులు AIని అడాప్ట్ చేసుకొని న్యాయప్రక్రియను స్పీడప్ చేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు రూపొందించిన ‘అదాలత్ ఏఐ’ టూల్ కోర్టు రూమ్ రూపాన్ని మార్చేస్తోంది. స్టెనో, టైపిస్టులతో పనిలేకుండా రియల్ టైమ్‌లో ప్రొసీడింగ్స్‌ ఇస్తోంది.

News October 27, 2025

డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

image

యంగ్ ప్లేయర్ పృథ్వీ షా రంజీలో డబుల్ సెంచరీ బాదారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్క్ దాటారు. ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 బంతుల్లో 222 రన్స్ చేశారు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన షా దేశవాళీల్లో రాణిస్తున్నారు.

News October 27, 2025

BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

image

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్‌బంధన్‌లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.

News October 27, 2025

భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

image

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్‌ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.