News November 23, 2024

అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ

image

మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీయేకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమవైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతిఒక్క ఎన్డీయే కార్యకర్త కష్టపడ్డారని, వారందరికీ థాంక్స్ చెబుతున్నానన్నారు. మరోవైపు ఝార్ఖండ్‌‌లో విజయం సాధించిన JMM కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు.

News November 23, 2024

RESULTS UPDATES: మాజీ CM కుమారుడి ఓటమి

image

* కర్ణాటక: శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ CM బొమ్మై కుమారుడు భరత్ ఓటమి
* MP: విజయపూర్‌లో మంత్రి రామ్‌నివాస్ రావత్ ఓటమి
* బిహార్‌: 4 స్థానాల్లోనూ(ఉప ఎన్నిక) NDA గెలుపు
* కర్ణాటక: 3 అసెంబ్లీ స్థానాల్లోనూ(బై పోల్) INC విక్టరీ
* పంజాబ్: డేరా‌బాబా నానక్‌లో గుర్‌దీప్ సింగ్ (AAP) గెలుపు
* ఝార్ఖండ్‌లో JMM కూటమి హవా.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం: చంపై సోరెన్

News November 23, 2024

వెనుకంజలో బాబా సిద్ధిఖీ కుమారుడు

image

MHలో ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కుమారుడు జీష‌న్ వాంద్రే ఈస్ట్ నుంచి వెనుకంజ‌లో ఉన్నారు. ఆయ‌న‌పై శివ‌సేన UBT అభ్య‌ర్థి వ‌రుణ్‌ స‌తీశ్ 10K ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వివాదాస్ప‌ద NCP నేత న‌వాబ్ మాలిక్ మ‌న్‌ఖుద్ర్ శివాజీ న‌గ‌ర్‌లో నాలుగో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న కుమార్తె స‌నా మాలిక్ అనుశ‌క్తి న‌గ‌ర్‌లో న‌టి స్వ‌రా భాస్క‌ర్ భ‌ర్త ఫ‌హ‌ద్‌పై 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ‘INDIA’పై ఎఫెక్ట్ తప్పదా?

image

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసి 18, ఝార్ఖండ్‌లో 30 చోట్ల బరిలో నిలిచి 15 స్థానాలకు పరిమితమైంది. ఇటీవల హరియాణా, అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు. ఇకపై INDIAలో కాంగ్రెస్‌ మాట చెల్లుబాటు కాదని, ఆ కూటమే గల్లంతైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగొచ్చని పేర్కొంటున్నారు.

News November 23, 2024

సీఎం పదవిపై గొడవలు లేవు: ఫడణవీస్

image

ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై కూట‌మిలో ఎలాంటి గొడ‌వలు లేవ‌ని, ఈ విష‌యంలో కూట‌మి నేత‌లంద‌రూ చ‌ర్చించుకొని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని దేవేంద్ర ఫడణవీస్ స్ప‌ష్టం చేశారు. సీఎం శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఫ‌లితాలు ప్ర‌ధాని మోదీకి మ‌హారాష్ట్ర ఇస్తున్న మ‌ద్దతుకు నిద‌ర్శ‌న‌మ‌ని నేతలు పేర్కొన్నారు. ఒక్క‌టిగా ఉంటే సుర‌క్షితంగా ఉంటామ‌న్న నినాదానికే ప్ర‌జ‌లు జైకొట్టార‌న్నారు.

News November 23, 2024

మిలింద్ దేవరాపై ఆదిత్య ఠాక్రే గెలుపు

image

శివసేన(UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే గెలుపొందారు. మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న వర్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆదిత్య.. శివసేన(శిండే) అభ్యర్థి మిలింద్ దేవరాపై గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి వీరిద్దరిలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మొత్తం 17 రౌండ్ల తర్వాత ఆదిత్య 8,801+ ఓట్లతో గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ హయాంలో మిలింద్ కేంద్ర మంత్రిగా పని చేశారు.

News November 23, 2024

పార్లమెంట్‌లో మీ గొంతుకనవుతా: ప్రియాంక

image

వయనాడ్‌లో అఖండ విజయం అందించినందుకు ప్రియాంకా గాంధీ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. నా గెలుపు మీ విజయమని భావిస్తున్నారు అని అనుకుంటున్నా. మీ ఆశలు, కలలను అర్థం చేసుకొని సాకారం చేసేందుకు మీరు ఎంచుకున్న వ్యక్తిగా మీ కోసం పోరాడతా. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News November 23, 2024

బెంగాల్‌లో క్లీన్ స్వీప్ చేసిన టీఎంసీ

image

బెంగాల్‌లో 6 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార TMC క్లీన్‌స్వీప్ చేసింది. మదరిహత్, మేదినిపూర్, సితాయ్, హరోవా, నైహతి నియోజ‌క‌వ‌ర్గాల్లో TMC విజ‌యం సాధించింది. సితాయ్, హరోవాలో ఆ పార్టీ అభ్యర్థులకు 1.30 లక్షలు చొప్పున మెజారిటీ దక్కింది. తల్దంగ్రాలో లీడింగ్‌లో కొన‌సాగుతోంది. బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 5 సీట్ల‌లో రెండో స్థానంలో, ఒకచోట మూడో స్థానంలో నిలిచింది.

News November 23, 2024

ఆటోను ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి

image

AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులు కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

News November 23, 2024

పోలీస్ స్టేషన్‌లోని మెయిన్ సీట్‌లో కాల భైరవుడి ఫొటో!

image

ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ప్రధాన అధికారిగా SHO ఉంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి పోలీస్ స్టేషన్‌లో మాత్రం కాశీ విశ్వనాథుడి రూపమైన కాలభైరవుడు ఉంటారు. స్టేషన్‌లో ప్రత్యేకంగా కుర్చీలో ఫొటో పెట్టి, టోపీ, బల్ల ఉంచుతారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని విధులు నిర్వహిస్తారు. స్వామికి పూజలు చేశాకే విధులు మొదలుపెడతారు. భైరవుడిని ‘కొత్వాల్’ అని పిలుస్తుంటారు.