India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ EC సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు SPలు అమిత్, బిందు మాధవ్, బదిలీ వేటు గురైన తిరుపతి SP కృష్ణకాంత్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని ఆదేశించింది. లేదంటే తమవద్ద ఉన్న ఆధారాలను బట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు CS జవహర్ ఉత్తర్వులిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కోర్టు ఆమెకు ఈనెల 20 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణ జరగనుంది.
TG:తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవ్వడంలేదు. తడిసిన ధాన్యం కొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. CM ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
AP: ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ సీజన్లో సగటు సాగు విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు కాగా 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇందులో 5.60 లక్షల టన్నులను ఆర్బీకేల ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
TG: టెట్ పరీక్షలు నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి. తొలిసారి ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనుండగా, రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉ.9 నుంచి ఉ.11:30 వరకు ఫస్ట్ సెషన్, మ.2 నుంచి సా.4 వరకు రెండో సెషన్ జరగనుంది. పరీక్షకు గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎగ్జామ్ టైమ్‌కి 15min ముందు సెంటర్ల గేట్లు మూసివేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. TGలో ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. అలాగే ఏపీలో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా, తూ.గో, ప.గో, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెరిట్ సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో ఈనెల 20 నుంచి 30వ తేదీలోపు రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. ఎంపీసీలో 8,624, బైపీసీలో 6,463, ఎంఈసీలో 484, సీఈసీలో 2,676, హెచ్ఈసీలో 229 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫలితాల కోసం ఇక్కడ <
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. UPలో 14, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్లో 7, బిహార్ 5, ఒడిశా 5, ఝార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్లో 1, లద్దాఖ్‌లో ఒక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. రాహుల్‌గాంధీ (రాయ్ బరేలీ), స్మృతి ఇరానీ(అమేఠీ), రాజ్‌నాథ్ సింగ్(లక్నో) వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4లోపు చేయవల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కనపెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో భాగమైన ప్రభుత్వ అధికారులను ఈ భేటీకి హాజరుకావొద్దని ఆదేశించింది.
మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనార్టీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగానే ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.