India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’, హరీశ్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈక్రమంలో వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా రద్దయినట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికైనా డైరెక్టర్ కొత్త స్టోరీలపై ఫోకస్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
అష్టమి గడియలు ఆగస్టు 26, 27 తేదీల్లో ఉండటంతో శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ మొదలైంది. రేపు ఉ.8.40 గంటల తర్వాత ఘడియలు ప్రారంభమై.. ఎల్లుండి ఉ.6.49 వరకు ఉన్నాయి. సూర్యోదయానికి తిథి ఉండటంతో AUG 26నే పండుగ జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. మర్నాడు సూర్యోదయం అయిన వెంటనే నవమి వస్తుండటంతో సోమవారమే చేసుకోవాలని సూచించారు. శ్రావణమాసంలో అమావాస్య ముందువచ్చే అష్టమి రోజున చిన్ని కృష్ణుడు జన్మించాడు.
AP: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 79,251 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది.
దర్శకుడు VV వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారనే ప్రచారంపై సన్నిహిత వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆయన హెల్త్ విషయమై ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరాయి. అంతకుముందు ఆయన అనారోగ్యం పాలయ్యారని, లివర్ సర్జరీ జరిగిందనే వార్త వైరల్‌గా మారింది.
HYDలోని నాగార్జునకు చెందిన <<13929013>>ఎన్<<>> కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది. అందులో అద్దె రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో 37వేలు, 27వేలు, 7వేలు, 5వేల చ. అడుగుల విస్తీర్ణంతో 4 హాళ్లు ఉంటాయి. ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు, గెట్ టు గెదర్ పార్టీలు ఇందులో జరుపుకుంటారు. అక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు మ.3 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ అధ్యక్ష పదవి, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించనున్నారు.
TG: అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు తీసుకొచ్చిన హైడ్రా పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. GO 111 పరిధిలోని 84 గ్రామాలకు దీనిని వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిధిలోని ఈ గ్రామాలు బఫర్ జోన్‌లోకి వెళ్లగా కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను తిరిగి తీసుకొస్తే నిర్మాణాల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది.
మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MSPతో పాటు రైతుల ఇతర డిమాండ్లను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, బడ్జెట్‌లోనూ పట్టించుకోలేదని విమర్శించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలని నిర్ణయించాయి.
TG: RTC ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వారికి చెల్లించాల్సిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ సొమ్ము, DAలు, PF బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలను RTC ఉద్యోగులకూ అమలు చేయాలని CMను కోరతామన్నారు. ఇక RTCలో రాజకీయ జోక్యం ఉండదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఉద్యోగుల లక్ష్యం కావాలన్నారు.
దేశవ్యాప్తంగా 768 బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. గోవాలోని పార్టీ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. వీటిలో ఇప్పటికే 563 సిద్ధమవ్వగా, మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. 2013లో జరిగిన గోవా సమావేశంతోనే బీజేపీ విజయాల బాట పట్టిందని ఆయన గుర్తు చేశారు.
Sorry, no posts matched your criteria.