News October 27, 2025

BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

image

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్‌బంధన్‌లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.

News October 27, 2025

భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

image

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్‌ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.

News October 27, 2025

ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

image

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 27, 2025

శ్రేయస్‌కు సీరియస్.. అసలు ఏమైందంటే?

image

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయింది. ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే Spleen(ప్లీహమ్) అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్(spleen rupture)కు దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్‌ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకే శ్రేయస్‌ను ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

News October 27, 2025

అసలైన భక్తులకు ప్రతిదీ దైవమే!

image

సమస్త జీవుల్లో దేవుణ్ని చూస్తూ, వాటిని సంతోషపెట్టడమే నిజమైన ఈశ్వర పూజ. మనసులో భగవంతుణ్ని స్థాపించుకున్న భక్తులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరమైన, అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగి ఉంటారు. అలాంటి భక్తులు తమ పనులన్నింటినీ భగవత్ సేవగానే భావించి, అంకితభావంతో చేస్తాడు. అందువల్ల వారికి వేరే ధ్యానం, ఆరాధన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. అతని ప్రతి కర్మ నిరంతర పూజగా మారుతుంది.<<-se>>#Daivam<<>>

News October 27, 2025

సెక్సీయెస్ట్ లయన్‌ను చూశారా?

image

ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన సింహం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మసాయి మారా(కెన్యా) అడవిలో ఉండే ఈ రింగుల జుట్టు మృగరాజును ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ క్లిక్ చేయగా వైరలవుతోంది. రంగురంగుల జూలుతో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ సింహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మృగరాజు నిజమైన అందానికి నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మోడల్స్‌కు పోటీనిస్తూ సెక్సీయెస్ట్ లయన్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.

News October 27, 2025

వార్డ్‌రోబ్ ఇలా సర్దేయండి

image

చాలామంది వార్డ్‌రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్‌రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్‌రోబ్ నీట్‌గా కనిపిస్తుంది.

News October 27, 2025

‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

image

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

News October 27, 2025

సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

image

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.