India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హరీశ్ శంకర్ ఇంటర్వ్యూల వల్లే ‘మిస్టర్ బచ్చన్’కు నెగటివిటీ వచ్చిందని తాను చెప్పినట్లుగా వస్తున్న వార్తలపై నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. ‘సినిమా చేయకముందే హరీశ్ నాకు ఫ్రెండ్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేస్తాం. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన రెమ్యునరేషన్ నుంచి డబ్బులిచ్చే వ్యక్తి ఆయన. ఈ మూవీతో పాఠాలు నేర్చుకున్నాం. భారీ మూవీతో తిరిగొస్తాం. నా వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేయొద్దు’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణలోని 18 జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలు ఇవే.. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ.
TG: అనురాగ్ సంస్థలు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడుతున్నాయని కేసు నమోదవడంపై ఆ సంస్థ ఛైర్మన్, BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ‘మా భూమి FTL, బఫర్ జోన్లో లేదు. HMDA అనుమతితోనే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మిస్తున్నాం. అక్రమంగా కేసులు పెట్టారు. అన్ని అనుమతులు, NOCలు ఇచ్చిన అధికారులే ఒత్తిడితో కేసులు పెడుతున్నారు. అనుమతులు లేకపోతేనే చర్యలు తీసుకోమని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.
టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్‌లో ఆయనకు మేజర్ లివర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తారని సమాచారం. ఈ విషయంపై వినాయక్ కుటుంబం ఎలాంటి ప్రకటనా చేయలేదు. స్టార్ హీరోలతో ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, యోగి, అదుర్స్, బద్రీనాథ్, ఖైదీ నంబర్ 150 తదితర చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ అప్రూవల్ రేటింగ్ 70 శాతంగా ఉందని ఇప్సోస్ ఇండియా సర్వే తెలిపింది. మే రేటింగుతో సమానంగా ఉందంది. ప్రధానిగా పనితీరుకు పోల్‌లో మంచి మార్కులు వచ్చాయంది. పరిపాలన, విద్య, స్వచ్ఛత, వైద్య రంగాల్లో రేటింగ్ బాగుందని పేర్కొంది. మూడో టర్మ్‌లో ఆయన హవా తగ్గలేదని, నార్త్ జోన్, టైర్1 నగరాల్లో తిరుగులేదని తెలిపింది. సౌత్ జోన్లో మాత్రం కాస్త తక్కువ రేటింగ్ వచ్చినట్టు వెల్లడించింది.
ఈటెను 90మీ. విసిరేందుకు నీరజ్ చోప్రాకు మరెంతో సమయం పట్టదని పారా అథ్లెట్ ఝఝారియా అన్నారు. ‘జావెలిన్ పరిభాషలో చెప్పాలంటే 89+ అతడికి అడ్డంకిగా మారింది. నా 20 ఏళ్ల కెరీర్లో గమనించింది ఏంటంటే ఎవరూ ఒకటి, అరాతో దాన్ని దాటలేరు. దాటితే 3, 4 మీటర్ల దూరం పెరగడం ఖాయం. రెండేళ్లలో నీరజ్ జావెలిన్‌ను 93మీ. విసరగలడు. ఎందుకంటే అతడికి అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. అప్పటికి అతడి కెరీర్ పీక్‌లో ఉంటుంది’ అని అన్నారు.
దేశీయంగా తొలిసారి ఎంపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్‌ను విశాఖలోని మెడ్‌టెక్ రూపొందించింది. ఎర్బాఎండీఎక్స్ ఎంపాక్స్ పేరుతో ఈ కిట్‌ను తయారు చేయగా ICMR, CDSCO నుంచి ఎమర్జెన్సీ క్లియరెన్స్ వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఆరోగ్య రంగంలో మనదేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సీఈవో జితేంద్ర శర్మ అన్నారు.
మహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ జమ్మూకశ్మీర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు శ్రమిస్తామని హామీ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తామంది. కశ్మీరీ పండితులను సగౌరవంగా రాష్ట్రానికి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని పేర్కొంది. పీఎస్ఏ, దేశద్రోహం, ఎనిమీ యాక్ట్‌లను రద్దు చేయిస్తామని తెలిపింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర వెల్లడించారు. రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
AP: సీఎం చంద్రబాబుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయనను కలిసి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేసినందుకు మందకృష్ణను చంద్రబాబు సత్కరించారు. కాగా ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌తోనూ ఆయన సమావేశమైన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.