India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ముందడుగు పడింది. కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనపై 2144 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. లైంగిక వేధింపులు, బలవంతం చేశారని ఇంటి పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. సరిగ్గా ఎన్నికల సమయం కావడంతో రేవణ్ణ కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. అరెస్టు చేస్తారని జర్మనీకి వెళ్లిపోయిన ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడితో బెంగళూరుకు తిరిగొచ్చారు.
AP: టీడీఆర్ బాండ్ల జారీలో అవకతవకలపై తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల భూసేకరణకు టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని టీడీపీ నేత రవినాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
పలు ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షల తేదీల రివైజ్డ్ షెడ్యూల్‌ను UPSC విడుదల చేసింది. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్, ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2025 ఫిబ్రవరి 9న జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, IFS ప్రిలిమ్స్ 2025 మే 25న నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు, దరఖాస్తుకు తుది గడువు వివరాలనూ UPSC ప్రకటించింది. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <
TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం TG ICET కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. తొలి విడతలో వచ్చే నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఆన్‌లైన్ పేమెంట్, స్లాట్ బుకింగ్, 3-9 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి 28 వరకు రెండో విడత ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్‌సైట్: https://tgicet.nic.in/
AP: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం ₹15.4 కోట్లు మంజూరు చేసిందని dy.cm పవన్ చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే 100 రోజుల్లో 30 నగరవనాల పనులు పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే వనమహోత్సవంలో యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు మారుమోగుతోంది. ఈయన 1970లో నల్గొండలో జన్మించారు. 1996లో డీఎస్పీగా ఎంపికైన రంగనాథ్‌కు తొలుత గ్రే హౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పోస్టింగ్ వచ్చింది. తర్వాత కొత్తగూడెం, నర్సంపేట, మార్కాపురం డీఎస్పీగా పనిచేశారు. 2012లో తూ.గో అడిషనల్ ఎస్పీగా గ్రేహౌండ్స్ ఆపరేషన్లను సమర్థవంతంగా డీల్ చేశారు. దీంతో ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
2007లో ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా(ఇబ్రహీంపట్నం) హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలోని నల్గొండలో అమృత-ప్రణయ్ కేసులో నిందితుడు మారుతిరావు అరెస్టు, విచారణను సమర్థంగా నిర్వహించారు. వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును ఆయనే డీల్ చేసి నిందితుడు సైఫ్‌ను త్వరగా అరెస్టు చేశారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా తన మార్క్ చూపుతున్నారు.
అమెజాన్‌లో ఓ ఉద్యోగి తాను ఏ పనీ చేయకుండా ఏడాదిన్నరలో $370,000(₹3.10cr) సంపాదించినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘గూగుల్ లేఆఫ్ తర్వాత ఇక్కడికి వచ్చా. ఇప్పటికి కేవలం ఏడు సమస్యలు పరిష్కరించా. ఎక్కువ సమయం మీటింగులలోనే గడిపా’ అని రాసుకొచ్చాడు. దీంతో కంపెనీల్లో కష్టపడి పనిచేస్తే గుర్తింపు దక్కదని, ఇలా పనిచేయకుండా ఉండేవారికే భారీ జీతాలు ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కులాలు, మతాలుగా సమాజం విడిపోతే వైషమ్యాలు పెరుగుతాయని కర్ణాటక సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. విద్యావంతుల్లోనూ కులపిచ్చి ఉండటం దారుణమన్నారు. ‘కుల వైషమ్యాలను పెంచేవాళ్లే గాంధీని చంపేశారు. ఆయన సిద్ధాంతాలు ఈనాటికీ పనిచేస్తాయి. శాంతి, సత్యం, న్యాయం, సోదరభావాన్ని ఆయన చాటారు. ప్రకృతి మన అవసరాలని తీరుస్తుందే తప్ప అత్యాశను కాదని చెప్పేవారు. నిజానికి వయనాడ్ విపత్తుకు అత్యాశే కారణం’ అని సిద్దూ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.