India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SAతో టీ20లో పూరన్(WI) 26 బంతుల్లోనే 65 రన్స్(7 సిక్సులు, 2 ఫోర్లు) చేశారు. ఈ క్రమంలో T20Iలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో బట్లర్(137), సూర్య(136), మ్యాక్సీ(134)ను వెనక్కునెట్టి 139 సిక్సర్లతో మూడో స్థానానికి చేరుకున్నారు. తొలి 2 స్థానాల్లో రోహిత్(205), గప్టిల్(173) ఉన్నారు. అలాగే అత్యధిక స్ట్రైక్ రేటు(250)తో హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. జాన్సన్(265.38) టాప్‌లో ఉన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న TG Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా AP నుంచి TGకి రావాల్సిన నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. మొత్తం 8 అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని భట్టి వివరించారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని నిర్మల చెప్పినట్లు పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. ‘ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉంది. మొన్న ఒక్కరోజే ఐదుగురు డెంగ్యూతో చనిపోయారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు ₹10లక్షల పరిహారం ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు.
డేటింగ్ యాప్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన పలు ఉదంతాలను జర్నలిస్ట్ దీపికా నారాయణ్ Xలో పోస్టు చేశారు. ‘డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయి అమాయక యువకులకు ఎరవేస్తుంది. హోటల్‌కు తీసుకెళ్లి ఖరీదైన ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంది. కాసేపటికి ఆమె జారుకుంటుంది. బిల్లు మాత్రం ₹వేలల్లో వస్తుంది. కట్టకపోతే హోటల్ సిబ్బంది దాడి చేస్తారు. దీంతో కొందరు ₹23-61వేలు చెల్లించారు’ అని పేర్కొన్నారు.
భారత అంతరిక్ష రంగం దూసుకెళ్తోంది. 10 ఏళ్లలో ఈ సెక్టార్‌లో $13బిలియన్లు ఇన్వెస్ట్ చేయగా, అది GDPకి $60బిలియన్ల సహకారం అందించినట్లు నోవాస్పేస్ నివేదిక వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 47లక్షల ఉద్యోగాలను కల్పించిందని తెలిపింది. 2014లో $3.8బిలియన్ల ఆదాయం రాగా, 2023కి ఆ మొత్తం $6.3బిలియన్లకు చేరినట్లు పేర్కొంది. పెట్టుబడుల పరంగా ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద స్పేస్ సెక్టార్‌గా భారత్ నిలిచిందంది.
వాట్సాప్‌లో ‘Lists’ అనే ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు లిస్టులు క్రియేట్ చేసుకుని వాటికి కాంటాక్ట్స్/గ్రూప్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఆయా లిస్టుల్లో ఉన్న వారికి ఈజీగా మెసేజింగ్, ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నంబర్లను ప్రత్యేక లిస్టులో పెట్టుకోవడం ద్వారా వెంటనే కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.
TG: N కన్వెన్షన్ కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది. గతంలో అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు? అక్రమ నిర్మాణాలకు రోడ్లు ఎందుకు వేశారు? ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. అనుమతులు ఇచ్చినవారిపైనా చర్యలు తీసుకోవాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
దేశంలో ఈ మధ్యన కుటుంబ వాస్తవ ఆదాయం తగ్గుతోందని SIE బ్రోకరేజ్ రిపోర్టు పేర్కొంది. రుతుపవనాలు ఆశలు రేపుతున్నా గ్రామీణ ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలంది. GDPలో 78 శాతంగా ఉన్న కుటుంబ ఆదాయం రాబోయే రోజుల్లో మెరుగవ్వొచ్చని అంచనా వేసింది. డిమాండ్ లేక వృద్ధి తగ్గిందని, రాయితీలు తగ్గించి కంపెనీలు మార్జిన్లను మెయింటేన్ చేస్తున్నాయంది. RBI చర్యలతో రిటైల్ రుణాల వృద్ధి తగ్గినట్టు తెలిపింది.
TG: నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌కు GHMC నుంచి నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతుల కోసం ప్రయత్నించారని, కానీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ‘తుమ్మిడికుంట చెరువులోని FTLలో 1.12 ఎకరాల్లో, బఫర్ జోన్‌లోని 2.18 ఎకరాల్లో కన్వెన్షన్ నిర్మించారు. N కన్వెన్షన్‌తో సహా అక్రమ నిర్మాణాలు కూల్చేశాం’ అని పేర్కొన్నారు.
TG: వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని డీహెచ్ రవీందర్ తెలిపారు. డెంగ్యూ కేసులపై ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకు 4,600కు పైగా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఖమ్మం సహా 10 జిలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. HYD జిల్లాలో 1,697 కేసులు నమోదయ్యాయి. ఇంటింటి సర్వే, పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.