News April 18, 2025

IPL: RCB vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPLలో నేడు బెంగళూరు వేదికగా RCB, PBKS తలపడనున్నాయి. అయితే, ఆ నగరంలో ఇవాళ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరుణుడు అడ్డుపడకుంటే మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా.. PBKS(17), RCB(16) మ్యాచుల్లో విజయం సాధించాయి.

News April 18, 2025

నారాయణ మూర్తి మనవడికి రూ.3.3కోట్ల డివిడెండ్

image

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.3.3 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. 2023లో రోహన్ జన్మించినప్పుడు బహుమతిగా రూ.240కోట్లు విలువ గల 15లక్షల షేర్లను నారాయణ మూర్తి ఇచ్చారు. దీంతో యంగ్ మిలియనీర్‌గా ఏకగ్రహ్ అవతరించారు. కాగా ఈ షేర్లకు గతేడాది రూ.7.35కోట్ల డివిడెండ్ అందుకున్నారు. ఇప్పటి వరకూ ఈ షేర్లపై మెుత్తంగా రూ.10.65కోట్ల డివిడెండ్ అందుకున్నారు.

News April 18, 2025

అప్పుడు బట్టతల.. ఇప్పుడు గోళ్లు..!

image

గతంలో మహారాష్ట్రలోని బుల్ఢానా జిల్లాలో హఠాత్తుగా జుట్టు కోల్పోయిన కొందరు ప్రజలకు ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయి. షెగావ్ డివిజన్‌లోని 4 గ్రామాల ప్రజలు అకస్మాత్తుగా గోళ్లు ముడతలు పడటం, ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారు. సెలీనియం స్థాయులు పెరగడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు చెబుతున్నారు. వారు తింటున్న గోధుమల్లో సెలీనియం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

News April 18, 2025

GOOD NEWS: వారికీ మాతృత్వ సెలవులు

image

AP: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. ఈ మేరకు మెటర్నిటీ సెలవులనూ డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇది వరకు రెగ్యులర్ ఉద్యోగినులకు మాత్రమే మాతృత్వ సెలవులు ఉండేవి.

News April 18, 2025

చరిత్ర సృష్టించిన ముంబై

image

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఒకే వేదికలో ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా MI నిలిచింది. ఆ జట్టు వాంఖడే వేదికగా ఛేదనలో 47 మ్యాచులు ఆడి 29 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ (ఈడెన్ గార్డెన్స్-28) రికార్డును ముంబై అధిగమించింది. ఆ తర్వాత RR (జైపూర్-24), RCB (బెంగళూరు-21), SRH (హైదరాబాద్-21), CSK (చెన్నై-20) ఉన్నాయి.

News April 18, 2025

గిరిజనులకు చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. అల్లూరి (D) డుంబ్రిగూడ (M) పెదపాడు గ్రామానికి చెందిన 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల అక్కడ పర్యటించిన Dy.CM కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించారు. వారి పాదరక్షల సైజ్ వివరాలు తెప్పించుకుని, తన ఆఫీసు సిబ్బందితో చెప్పులు పంపించారు.

News April 18, 2025

ఇక అందరికీ అందుబాటులోకి పైలట్ శిక్షణ!

image

వాణిజ్య పైలట్ లైసెన్స్ శిక్షణ పొందాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా ఉండాలనే రూల్‌ను DGCA ఎత్తేయాలని యోచిస్తోంది. దీంతో ఆర్ట్స్, కామర్స్ తదితర కోర్సులు చేసిన వారు కూడా దీనికి అర్హత పొందనున్నారు. 1990 నుంచి ఇండియాలో ఈ రంగంలో సైన్స్& మ్యాథ్స్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే ఫిట్‌గా ఉండి విద్యార్హతలు ఉన్న వారందరూ అర్హత పొందనున్నారు.

News April 18, 2025

OTTలోకి రెండు కొత్త సినిమాలు.. ఎప్పుడంటే?

image

‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’ OTT రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అటు ‘DJ టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ సినిమా కూడా అనుకున్న తేదీ కంటే ముందే OTT బాట పట్టనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది.

News April 18, 2025

రాష్ట్రానికి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం

image

AP: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

News April 18, 2025

స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

image

అమృత్‌ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్‌ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!