India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అచ్యుతాపురం సెజ్‌లో మొన్న జరిగిన ప్రమాద ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారించనుంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించడంతో పాటు 60 మందికి పైగా గాయపడినట్లు వచ్చిన వార్తల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, ఎసెన్షియా కంపెనీకి NGT నోటీసులు ఇచ్చింది.
TG: కల్యాణ లక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,225.43కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.2,175కోట్లు కేటాయించింది. అందులో నుంచి 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు నిధులు రిలీజ్ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
TG: కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు CM రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌తో సహా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ వెళ్లనున్నారు. TPCC చీఫ్, క్యాబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో వీటిపై స్పష్టత రానున్నట్లు సమాచారం. PCC చీఫ్ రేసులో బలరాం నాయక్, మధుయాష్కీ, మహేశ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామనే హామీని కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే డిమాండ్‌తో ఆ పార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్(NC) పొత్తుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ఏర్పాటు చేసింది. దీన్ని స్థానికంగా బలమైన NC సహా PDP వ్యతిరేకిస్తున్నాయి.
AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు మొదలుకానున్నాయి. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
AP: గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలేంటంటే..
అంశం-1: మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు
అంశం-2: మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు
అంశం-3: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు
అంశం-4: ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం
TG: రేషన్ కార్డులు ఉన్న వారికి రాయితీపై గోధుమలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం HYDలో మాత్రమే వీటిని అందిస్తుండగా, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అటు రూ.500కు గ్యాస్ సిలిండర్ల పంపిణీపైనా ఆయన సమీక్షించారు. వినియోగదారులకు సిలిండర్ సరఫరా అయిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు.
SC రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. జైశ్రీపాటిల్ అనే న్యాయవాది ఈ తీర్పును సమీక్షించాలని కోరారు. ‘SC, STల రిజర్వేషన్ల విషయంలో 1950 నాటి ఉత్తర్వులను సవరించే అధికారం పార్లమెంట్‌కు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఆర్టికల్ 341, 342 ప్రకారం వర్గీకరించే అధికారం రాష్ట్రపతి, పార్లమెంట్‌కు మాత్రమే ఉంది’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
AP: అధికారంలో ఉండగా తప్పుడు పనులు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి చేతగానితనమని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు. మేం అధికారంలోకి వచ్చి 60 రోజులే అయింది. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. వాళ్లలా మేం తప్పుచేయం’ అని స్పష్టం చేశారు.
AP: అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేటి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటారు.
Sorry, no posts matched your criteria.