News October 27, 2025

సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

image

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.

News October 27, 2025

మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

image

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్‌కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్‌ప్రదేశ్‌ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.

News October 27, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.

News October 27, 2025

నాగార్జున సాగర్.. CCTVల ఏర్పాటుకు అనుమతి

image

నాగార్జున సాగర్ జలాశయం కుడి వైపు(AP) CCTVల ఏర్పాటుకు TG ప్రభుత్వానికి KRMB అనుమతి ఇచ్చింది. డ్యామ్ పర్యవేక్షణకు AP భూభాగంలో CCTVల ఏర్పాటుకు TG నీటిపారుదల అధికారులు ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు సాగర్ కుడివైపు రిజర్వాయర్ నిర్వహణకూ ఏపీ అనుమతి ఇవ్వడం లేదనే ఫిర్యాదుపై KRMB స్పందించింది. 2014లో విభజన చట్టం తర్వాత, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుంటోంది.

News October 27, 2025

ఏడాదిలో ఒక్కసారైనా చేసుకోవాల్సిన టెస్టులు!

image

* CBC (కంప్లీట్ బ్లడ్‌కౌంట్): రక్తహీనత & ఇన్ఫెక్షన్లను తెలిపేది
* HbA1c: రక్తంలో దీర్ఘకాలిక చక్కెర స్థాయులను చూపేది
* లిపిడ్ ప్రొఫైల్: గుండె జబ్బుల ప్రమాదాన్ని వెల్లడించేది
* విటమిన్-D: అలసట & రోగ నిరోధకశక్తి తక్కువగా ఉందని తెలిపేది
* విటమిన్ B12: మానసిక ఆరోగ్యం & నరాల పనితీరు అంచనా కోసం
* సి-రియాక్టివ్ ప్రొటీన్ (CRP): శరీరంలో వాపును సూచించేది
* LFT& KFT టెస్ట్: లివర్, కిడ్నీ పనితీరు అంచనా వేసేది

News October 27, 2025

వేరుశనగ వరద ముంపునకు గురైతే ఏం చేయాలి?

image

సాధ్యమైనంత వేగంగా పొలం నుంచి నీటిని తీసివేయాలి. ఈ సమయంలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో టెబుకోనజోల్ 200ml లేదా హెక్సాకొనజోల్ 400ml కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. ఐరన్ లోపం కనిపిస్తే లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా.తో పాటు సిట్రిక్ యాసిడ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

మరోసారి భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

image

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్‌కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్‌ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్‌ఈస్ట్ స్టేట్స్‌పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.

News October 27, 2025

14,582 పోస్టులు… ఫలితాలు ఎప్పుడంటే…

image

SSC CGL టైర్1 ఫలితాల విడుదల తేదీపై అభ్యర్ధులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నవంబర్ చివరి వారంలో ఈ రిజల్ట్స్‌ను ప్రకటించవచ్చని కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ నౌ పేర్కొంది. NOV25న వచ్చే అవకాశముందని వివరించింది. ఈ పరీక్షల ప్రైమరీ కీపై అక్టోబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించి ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది హాజరయ్యారు.

News October 27, 2025

RAC సీట్లకు సగం ఛార్జీలు తిరిగి చెల్లించాలని డిమాండ్!

image

రైళ్లలో RAC ఛార్జీలపై ప్రయాణికులు SM వేదికగా విమర్శలు చేస్తున్నారు. సగం సైడ్ లోవర్ బెర్త్‌కు పూర్తి ఛార్జీ వసూలు చేయడం అన్యాయమని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు నిద్ర లేకుండా ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ట్ తయారైన వెంటనే RAC ప్రయాణికులకు సగం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని అమలు చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 27, 2025

నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

image

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>