News August 15, 2024

ఎందరో మహానుభావుల త్యాగఫలితం మన స్వాతంత్ర్యం: సీఎం చంద్రబాబు

image

దేశ ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు ట్విటర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర్య దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు

News August 15, 2024

ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి: మోదీ

image

వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది కలల తీర్మానమని PM మోదీ స్పష్టం చేశారు. ‘మనం అనుకుంటే 2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. మన దేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా చేయాలి. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చాలి. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. దేశాభివృద్ధికి పాలన, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం. అంతరిక్షంలో IND స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలి’ అని PM ఆకాంక్షించారు.

News August 15, 2024

రాష్ట్రంలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

AP: ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నేటి నుంచి సమ్మె కొనసాగనుంది. రూ.2,500 కోట్ల బకాయిలకుగాను రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాశకు గురయ్యాయి. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చినా వెనక్కు తగ్గలేదు. గతంలో ఇచ్చిన సమ్మె నోటీసుకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి.

News August 15, 2024

మహనీయుల కలలను సాకారం చేయాలి: మోదీ

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని PM మోదీ పిలుపునిచ్చారు. ‘దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాణాలర్పించిన సమరయోధులకు దేశం రుణపడి ఉంది. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర్యం కోసం 40కోట్ల మంది పోరాడారు. ఇప్పుడు మన జనాభా 140కోట్లు. మనం వారి కలలను సాకారం చేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి’ అని సూచించారు.

News August 15, 2024

ఆ 13 గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ రెపరెపలు

image

మావోయిస్టుల కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ఊళ్లలో జాతీయ జెండాను ఎప్పుడూ ఎగురవేయలేదు. ఎట్టకేలకు 13 ఊళ్లకు ఇప్పుడు స్వాతంత్ర్యం లభించింది. గడచిన 7 నెలలుగా ఆ గ్రామాల్లో తమ కృషి సత్ఫలితాలను ఇచ్చిందని పోలీసులు తెలిపారు. నెర్లిఘాట్, పనిదోబిర్, గుండం, పుట్కెల్, చుత్వాహీ, కస్తూర్‌మేట, మాస్పూర్, ఇరాక్‌భట్టి, మొహందీ, టెకల్‌గూడెం, పువర్తి, లఖపాల్, పులాన్‌పాడ్ గ్రామాల్లో జెండా ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు.

News August 15, 2024

22 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్

image

AP: డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3లోపు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.

News August 15, 2024

కొత్తగా 4 వేల రేషన్ షాపులు

image

AP: ఇంటింటికీ రేషన్ పథకానికి ఉపయోగించిన 9,260 MDU వాహనాలతో ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి బదులుగా చౌకదుకాణాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్తగా 4వేల రేషన్ దుకాణాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,796 షాపులు ఉన్నాయి. వాటిలో ఖాళీగా ఉన్న 6,500 దుకాణాలకు త్వరలోనే కొత్త డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News August 15, 2024

విక్రమ్ ‘తంగలాన్’ పబ్లిక్ టాక్

image

పా.రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్ మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. చియాన్ యాక్టింగ్, మేకప్, గ్రాండ్ విజువల్స్, BGM అదిరిపోయాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మధ్యలో కొంచెం స్లోగా అనిపించినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని పేర్కొంటున్నారు. డైరెక్టర్, హీరోకు కమ్ బ్యాక్ లాంటి చిత్రమని చెబుతున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News August 15, 2024

ఆ ప్రాంతంలో నిన్న రాత్రే జెండా ఎగురవేశారు!

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు ఉదయం మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. కానీ బిహార్‌లోని పూర్నియాలో మాత్రం నిన్న రాత్రే ఈ కార్యక్రమం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిందని తెలియగానే 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో పూర్నియాలో రామేశ్వరప్రసాద్ సింగ్ అనే వ్యక్తి అక్కడి జెండా చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.

News August 15, 2024

ఆస్పత్రులను తనిఖీ చేయండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

image

TG: సీజనల్ వ్యాధులు, డెంగీ జ్వరాల వ్యాప్తిని అరికట్టడంపై కలెక్టర్లు, ఉన్నతాధికారులు దృష్టిసారించాలని CS శాంతి కుమారి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో తనిఖీలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం, మందులు నిర్ణీత ధరలకే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే.