News November 2, 2025

ఇంటర్వ్యూతో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని బ్రిక్ ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(<>BRIC<<>>-thsti) 5 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పీజీ(లైఫ్ సైన్స్), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 17, 18,19 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thsti.res.in/

News November 2, 2025

IAS అకాడమీల తప్పుడు ప్రచారాలు.. భారీ జరిమానా

image

UPSCలో అభ్యర్థుల విజయాలను తమ ఘనతగా చెప్పుకున్న ఢిల్లీలోని రెండు IAS కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొరఢా ఝళిపించింది. ఒక్కో సంస్థకు ₹8L చొప్పున ఫైన్ విధించింది. తాను కేవలం ఒక్క ఇంటర్వ్యూకు హాజరైతే క్రెడిట్‌ను దీక్షంత్ సంస్థ తమ ఖాతాలో వేసుకుందని 2021లో సివిల్స్ విజేత మణిశుక్లా ఫిర్యాదు చేశారు. అలాగే తన అనుమతి లేకుండా ఫొటో వాడిందంటూ అభిమను అకాడమీపై నటాష ఫిర్యాదు చేశారు.

News November 2, 2025

కాలీఫ్లవర్‌లో బటనింగ్ తెగులును ఇలా గుర్తించండి

image

కాలీఫ్లవర్‌ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News November 2, 2025

వంటింటి చిట్కాలు

image

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

News November 2, 2025

జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

image

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్‌కు లేదన్నారు.

News November 2, 2025

MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>) 4 సీనియర్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News November 2, 2025

న్యూస్ రౌండప్

image

☛ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్న CM చంద్రబాబు
☛ ఇవాళ 6PM నుంచి HYD యూసుఫ్‌గూడలో KTR రోడ్ షో
☛ WWC: ACA ఆధ్వర్యంలో VJA ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ LED స్క్రీన్ ఏర్పాటు
☛ 3 గంటలుగా VJA ఎక్సైజ్ ఆఫీసులోనే జోగి రమేశ్

News November 2, 2025

టాస్ గెలిచిన టీమ్ ఇండియా

image

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, జితేశ్, దూబే, అక్షర్, అర్షదీప్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, అబాట్

News November 2, 2025

WWC ఫైనల్: వన్డేల్లో పైచేయి ఎవరిదంటే..

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో మొదలుకానుంది. వన్డేల్లో ఇప్పటిదాకా 34 మ్యాచుల్లో 2 టీమ్స్ తలపడ్డాయి. ఇందులో 20-13 లీడ్‌తో ఇండియాదే పైచేయి కావడం గమనార్హం. ఓ మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఇక WCలో 6 మ్యాచ్‌లు ఆడగా తలో 3 గెలిచాయి. చివరగా WWCలోనే విశాఖలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌కు కాస్త వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది.

News November 2, 2025

‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

image

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.