India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఈనెల 6న కార్మిక& ఉపాధిశాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 6 కంపెనీలలో 740 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ , డిగ్రీ అర్హతగల 18 నుంచి 30ఏళ్ల వయసు గలవారు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.

బంగారు దంతాలను పెట్టుకునే వారిని చూసుంటారు.. ఈయన కాస్త వెరైటీ! వజ్రపు కన్ను పెట్టుకున్నారు. $2M విలువైన 2 క్యారెట్ల వజ్రాన్ని కృత్రిమ కనుగుడ్డుగా అమర్చుకున్నారు. US అలబామాకు చెందిన స్లేటర్ జోన్స్(23)కు 17 ఏళ్ల వయసులో Toxoplasmosis ఇన్ఫెక్షన్ వల్ల కుడి కన్నులో చూపు మందగించింది. సర్జరీలు చేయించుకున్నా మార్పు రాలేదు. దీంతో స్వయానా ఆభరణాల వ్యాపారైన ఆయన వజ్రంతో కనుగుడ్డును తయారు చేయించుకున్నారు.

✏ చిరంజీవి ‘మన శంకర్‌వరప్రసాద్‌గారు’ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెలలోనే వచ్చే అవకాశం.. ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచిన ‘మీసాల పిల్ల’ సాంగ్
✏ ఈ నెల 6న రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం
✏ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీమ్
✏ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. రేపు సక్సెస్ సెలబ్రేషన్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.