News November 22, 2024

BGT: ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్టు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌తోపాటు హాట్ స్టార్‌లో కూడా వీక్షించవచ్చు. స్థానిక భాషల్లోనూ మ్యాచ్ లైవ్ అవుతుంది. కాకపోతే ఈ ఛానళ్లను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా చూడవచ్చు. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

News November 22, 2024

JEE MAIN: నేడే లాస్ట్ డేట్

image

జేఈఈ మెయిన్-2025 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇవాళ రా.9 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రా.11.50 వరకు ఫీజు చెల్లించవచ్చని NTA తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్ష జరగనుంది. ఏప్రిల్‌లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది.
వెబ్‌సైట్: jeemain.nta.nic.in

News November 22, 2024

మా డాడీ ఫస్ట్ బైక్ ఇదే: సల్మాన్ ఖాన్

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన తండ్రి సలీమ్ ఖాన్ కొనుగోలు చేసిన తొలి బైక్ ఏంటో సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్రయంఫ్ టైగర్ 100 బైకును 1956లో కొన్నట్లు తెలిపారు. తన తండ్రి, ఆ బైకుతో తీసుకున్న ఫొటోలను Xలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆయన ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

News November 22, 2024

సురేఖపై నాగార్జున దావా.. ఈనెల 28న తీర్పు

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సురేఖ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై గురువారం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు లాయర్ డిమాండ్ చేశారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపారు.

News November 22, 2024

BGT తొలి టెస్టు: అశ్విన్, జడేజా ఆడట్లేదా?

image

మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న BGT తొలి టెస్టులో భారత్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్, జడేజాను కాదని సుందర్ వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల NZ సిరీస్‌లో సుందర్ 2 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక పేసర్లుగా బుమ్రా, సిరాజ్, రాణా, నితీశ్ ఆడనున్నట్లు తెలుస్తోంది.

News November 22, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లకు ట్రాన్‌స్క్రిప్ట్‌లు (TEXT) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తొలుత కొన్ని సెలెక్టెడ్ లాంగ్వేజ్‌లలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వాయిస్ మెసేజ్ వినలేనప్పుడు, దాని ట్రాన్‌స్క్రిప్ట్‌లు చదివి మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవచ్చని వివరించింది. ఈ ట్రాన్‌స్క్రిప్ట్‌లను వాట్సాప్ లేదా ఇతరులు చదివేందుకు వీలుండదని, సెక్యూర్డ్‌గా ఉంటాయని తెలిపింది.

News November 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 22, 2024

నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016 : సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)

News November 22, 2024

అతి చిన్నవయస్కురాలైన పైలట్ గురించి తెలుసా?

image

దేశంలో అతి చిన్న వయస్సులో కమర్షియల్ పైలట్‌ లైసెన్స్ పొందిన రికార్డు హిమాచల్‌కు చెందిన సాక్షి కొచ్చర్ పేరిట ఉంది. 10ఏళ్ల వయసుకే పైలట్ కావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకు కుటుంబీకులూ అండగా నిలిచారు. ఇంటర్ పూర్తి కాగానే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్‌లో పైలట్ శిక్షణకు పంపించారు. అనంతరం అమెరికాలో ట్రైనింగ్ పొందిన సాక్షి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు.

News November 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 22, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:25
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.